Venu Medipelly, News18, mulugu
ములుగు జిల్లా వైద్య అధికారి డాక్టర్అప్పయ్య తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లాలో టీబీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి సొంత ఖర్చులతో న్యూట్రీషియన్ కిట్లను అందజేయడం జరిగింది. ములుగు జిల్లాలో టీబీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి డాక్టర్ అప్పయ్య నేనున్నాను అంటూ ధైర్యం చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాటికోసం తగిన పోషకాలు తీసుకుంటేనే మనిషి కుదుటపడుతుంటాడు. కానీ చాలామందికి పోషక పదార్థాలు కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో బతుకు జీవుడా అంటూ జీవనం గడిపేస్తున్నారు.
పేదరికంలో మగ్గిపోతూ వ్యాధితో బాధపడుతున్న వారికి డాక్టర్ అప్పయ్య ఉచితంగా సొంత ఖర్చులతో న్యూట్రిషన్ కిట్లను వారికి అండగా నిలబడుతున్నాడు... ఈ కిట్లను దాదాపు 6 నెలల వరకు కూడా ఉచితంగానే పంపిణీ చేస్తానని అప్పయ్య చెప్తున్నారు. ములుగు జిల్లాలో గౌరవ వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారి పిలుపుమేరకిఅప్పయ్య టీబీ వ్యాధి గ్రస్తులకుభరోసా కలిపిస్తున్నారు.
నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా డాక్టర్ అప్పయ్యతన సొంత ఖర్చులతో ములుగు జిల్లా సర్వసభ్య సమావేశంలో గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ ప్రజా ప్రతినిధుల సమక్షంలో TBరోగులకు న్యూట్రిషన్ కిట్లు అందజేయడం జరిగింది.
జిల్లాలోని గోవిందరావుపేట, పసర, రాయను గూడెం, తాడువాయి, వెంకటాపూర్ ములుగు, కొడిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రోగులకు ఈ న్యూట్రిషన్ కిట్టు అందజేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ కిట్ ద్వారా TBరోగికి పోషకాహారము, తనకు అవసరమైన మాంసకృత్తులు, అందజేయబడతాయి. తద్వారా క్షయ వ్యాధి త్వరగా నయమవుటకు ఈ కిట్టు దోహదపడుతుంది.
ఈ న్యూట్రిషన్ కిట్లో ఏ ఏ వస్తువులు ఉంటాయి...?
ఈ యొక్క న్యూట్రిషన్ కిట్ లో ఉండే వస్తువుల వివరాలు.1.30 కోడిగుడ్లు 2.ఒక కిలో నూనె 3.రెండు కిలోల పప్పు 4.5 కిలోల బియ్యంఇవి అయిపోయిన తర్వాత మళ్లీ వారికి ఇదే రకమైన కిట్టు అందజేయబడుతుంది.ఇలా వారికి ఆరు నెలల పాటు అందజేయబడుతుంది. అనంతరం జిల్లా ప్రతినిధులకు మరియు జిల్లా అధికారులకు డాక్టర్ అప్పయ్య, మీరు కూడా TBరోగుల భరోసా కల్పించాల్సిందిగావిజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana