హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఏరియా ఆసుపత్రిలో మూడు రోజులపాటు కేంద్ర వైద్య బృందం పర్యటన.. ఏం చేసిందో తెలుసా?

ఏరియా ఆసుపత్రిలో మూడు రోజులపాటు కేంద్ర వైద్య బృందం పర్యటన.. ఏం చేసిందో తెలుసా?

X
ఏరియా

ఏరియా ఆస్పత్రిలో అధికారుల పర్యటన

Telangana: ములుగు జిల్లా కేంద్రంగా 100 పడకల ఏరియా సామాజిక ఆసుపత్రి అనేకమంది ప్రజలకు వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ములుగు జిల్లా కేంద్రంగా 100 పడకల ఏరియా సామాజిక ఆసుపత్రి అనేకమంది ప్రజలకు వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ములుగు జిల్లాలో 85 శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగడం విశేషం. కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే ములుగు ఏరియా సామాజిక ఆసుపత్రిని నేషనల్ అసెస్మెంట్ క్వాలిటీ బృందం మూడు రోజులపాటు పరిశీలించింది. ఈ బృందంలో నలుగురు సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. వీరు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు వై రమేష్, డాక్టర్ నిషిగంధ, డాక్టర్ భద్ర, డాక్టర్ శిల్ప బాబు ఈ బృందంలో ఉన్నారు.

ఆసుపత్రిలోని నాణ్యత ప్రమాణాలపై నేరుగా ఆస్పత్రికి వచ్చిన బృందం పేషంట్లతో మాట్లాడి.. ఏ విధమైన సర్వీస్ అందుతుంది.. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని 14 డిపార్ట్మెంట్లలోఒక్కో విభాగంలో మూడు నాలుగు గంటల పాటు పరిశీలించారు.

మొత్తం మూడు రోజులు ఈ బృందం ఆస్పత్రిలోని తీరుతెన్నులు, నాణ్యతా ప్రమాణాలను పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా రిమోట్ ఏరియాలో ఉన్న ఈ ఆసుపత్రిలో 85% కాన్పులు ఇక్కడే జరుగుతున్నాయని తెలుసుకున్న బృందం సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వైద్యులకు అభినందనలు సైతం తెలియజేసింది.

ఆస్పత్రిలో ఉన్న చిన్న లోపాలను గుర్తించి సరైన సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18తోమాట్లాడిన ములుగు జిల్లా సామాజిక ఆసుపత్రి వైద్య అధికారి.. మూడు రోజులపాటు పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని.. మాకు చాలా సంతోషంగా ఉందని.. ఈ నివేదికను ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని చెప్పారు. \

నాణ్యతా ప్రమాణాల ప్రకారం అర్హత సాధిస్తే ఆస్పత్రికి సంవత్సరానికి 10 లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు 30 లక్షల రూపాయలు రానున్నాయని తెలిపారు. వీటితో ఆస్పత్రి అభివృద్ధితో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని వైద్య అధికారి చెప్తున్నారు. మూడు రోజులు పర్యవేక్షించిన బృందంలో చాలా సీనియర్ అధికారులు ఉన్నారని.. వారందరూ కూడా ఆస్పత్రి నిర్వహణ, నాణ్యత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారని.. ఇప్పటివరకు ములుగు జిల్లా ఆస్పత్రి వైద్య బృందం నాణ్యత ప్రమాణాలలో అర్హత సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని వైద్య అధికారి చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు