రిపోర్టర్ : వేణు
లొకేషన్ : ములుగు
రాష్ట్రంలో అంతత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి వెలుగు 2.0 కార్యక్రమాన్ని జనవరి 19వ తారీకు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. కంటి వెలుగు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాలలో విశేష స్పందన కనబడుతుంది. కంటి పరీక్షలు చేయించుకోవడం కోసం గ్రామ ప్రజలు లైన్ కడుతున్నారు. ములుగు జిల్లాలో మొత్తం 20 కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు జిల్లా వ్యాప్తంగా నాలుగువేల మందికి పైగానే కంటి పరీక్షలు నిర్వహించారు.
కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా అమలు అవుతుందనే అంశాలు తెలుసుకోవడం కోసం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ చల్వాయి గ్రామంలోని కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడి ఏ విధంగా జరుగుతుంది.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ.. రోజు ఎంతమంది కంటి పరీక్షల కోసం వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కంటి సమస్య ఎక్కువగా ఉంటే వారిని వెంటనే ప్రభుత్వ కంటి ఆసుపత్రికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ తో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ వైద్య శిబిరాన్ని సందర్శించారు. సందర్శించడమే కాకుండా కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కచ్చితంగా కంటి పరీక్షలునిర్వహించాలని, అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు అందించాలని మంత్రి ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమానికి జనాల నుంచి విశేష స్పందన రావడంతో కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఓపికతో పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న అందత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగును తీసుకువస్తుందని, గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టు కింద హెల్త్ ప్రొఫైల్ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని.. కంటి వెలుగు కార్యక్రమంలో కంటి ఆపరేషన్ అవసరం అయిన వారి వివరాలతో పాటు ప్రత్యేక అద్దాలు కావాల్సిన వారి అవసరమైన వివరాలు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana