హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ చరిత్ర తెలిసేలా ఆ జిల్లాలో వినూత్నంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ చరిత్ర తెలిసేలా ఆ జిల్లాలో వినూత్నంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

రామప్పలో

రామప్పలో వేడుకలు

మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో మొదటి రోజు భాగంగా భారీ ర్యాలీలు, రెండవ రోజు జాతీయ పతాక ఆవిష్కరణ, మూడవ రోజు తెలంగాణ చరిత్ర ప్రపంచ నలుమూలల తెలిసే విధంగా చరిత్రాత్మక కట్టడాలలో ముగింపు ఉత్సవాలను నిర్వహించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  ములుగు (Mulugu) జిల్లా రామప్పలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల (Telangana National Unity Vajrotsavam) ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ చరిత్ర ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో మొదటి రోజులో భాగంగా భారీ ర్యాలీలు, రెండవ రోజు జాతీయ పతాక ఆవిష్కరణ, మూడవ రోజు తెలంగాణ చరిత్ర ప్రపంచ నలుమూలల తెలిసే విధంగా చారిత్రాత్మక కట్టడాలలో ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈక్రమంలో ములుగు జిల్లాలో యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న రామప్ప క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ వాయిద్య కారుడు శివమణి తన డ్రమ్స్‌తో ఆకట్టుకోగా, గురుకుల విద్యార్థినుల నృత్యాలు, రామప్ప కళావేదికపై చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకర్షించాయి.

  ఈకార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక ప్రాంతాలలోనే ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, అలాగే ఇక్కడ ఉన్న చారిత్రాత్మక కట్టడాల ప్రాముఖ్యతను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు.

  శివమణి డ్రమ్స్‌కి మంత్రి ఎమ్మెల్యే స్టెప్పులు

  వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో శివమణి డ్రమ్స్ (Shiva mani drums) పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. శివమణి స్టేజిపై డ్రమ్స్ వాయిస్తుండగా మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క సరదాగా చిందేశారు. సుమారు గంటకు పైగానే శివమణి తన సంగీత వాయిద్యాలతో మ్యాజిక్ చేస్తూ చూపర్లను కట్టిపడేశాడు. అనంతరం మొదటిసారిగా రామప్పకు విచ్చేసిన శివమణికి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా సన్మానించారు.

  అయితే కార్యక్రమం మధ్యలో ఉండగా కొద్దిగా వర్షం కురిసింది. దీంతో వేడుకలు మధ్యలోనే నిలిపివేయాలనే నిర్ణయానికి వస్తున్న తరుణంలో వాన ఆగిపోవడంతో తిరిగి కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే సమయాభావం వలన కొన్ని ప్రదర్శనలను అధికారులు రద్దు చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శన, రామప్ప లేజర్ షో సహా మిగిలిన కార్యక్రమాలన్నీ రద్దయిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులకు చివరికి నిరాశే మిగిలింది. కానీ వచ్చినందుకు శివమణి షో చూడటం ప్రేక్షకులకు కొంత మేరకు సంతోషాన్ని కలిగించింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mulugu, September 17

  ఉత్తమ కథలు