Home /News /telangana /

MULUGU TELANGANA GOVERNMENT HAS NOT COMPLETED THE CONSTRUCTION OF DOUBLE BEDROOM HOUSES IN MULUGU DISTRICT SNR MMV BRV

Mulugu: పేదవాడి సొంతింటి కల నెరవేరేదేప్పుడు?: ములుగు జిల్లాలో అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు

(పూర్తి అయ్యేదెప్పుడో ..!)

(పూర్తి అయ్యేదెప్పుడో ..!)

Mulugu: ఏజెన్సీ ప్రాంతం అంటే చాలు అటు పాలకులకు..ఇటు అధికారులకు చిన్నచూపే. అభివృద్ది కార్యక్రమాలు చేపట్టంలో..సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లాలో అర్ధాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లే అందుకు నిదర్శనం.

ఇంకా చదవండి ...
    (Venu Medipelly,News18,mulugu)
    ప్రజాస్వామ్య పాలనలో ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉంది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలకు అవిస్తాం, ఇవిస్తాం అంటూ వాగ్దానాలు చేస్తున్న నేతలు..అధికారంలోకి వచ్చాక ఆ వాగ్ధానాలను గాలికొదిలేస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లోనూ నేతలను తప్పుబట్టలేము. కానీ, చేతి దాకా వచ్చిన పథకాలకు మధ్యలోనే బ్రేక్ పడడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ప్రభుత్వం, నేతలపై నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. పేద వారి సొంతింటి కలను సాకారం చేస్తూ తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం పథకాన్ని(Double bedroom scheme) తీసుకు వచ్చింది. ములుగు (Mulugu)లాంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ పథకం ఏమాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ఏళ్లకేళ్లు గడుస్తున్నాపేదవాడి సొంతింటి కల మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.

    ములుగు జిల్లాలో ముందుకు సాగని డబుల్ బెడ్రూం పథకం:
    తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ములుగు జిల్లా అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా మిగిలింది. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలంటే ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలో డబుల్ బెడ్రూం పథకం అమలుచేయగా, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా చిన్నచిన్న గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంతవరకు నిర్మాణ పనులే ప్రారంభించక పోవడం లబ్ధిదారులకు నిరాశకు గురవుతున్నారు. పాతవి నిర్మాణంలోనే ఉండగానే మరోవైపు కొత్త ఇల్లు మంజూరు అవుతాయో లేదో అన్న ఆందోళన కూడా నిరుపేదల్లో ఉంది. మరోవైపు ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. సంవత్సరాల తరబడి పనులు సాగుతుంటే పేదవాడికి సొంతింటి కల ఎప్పుడూ సాకారం అవుతుందో అర్థం కాని పరిస్థితి.

    శాఖల వారీగా పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణం:

    ములుగు జిల్లాలో టెండర్ ప్రకారం ఇళ్ల నిర్మాణం మూడు ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ పర్యవేక్షణలో భాగంగా రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాయి. ఇందులో ఎక్కువగా గిరిజన సంక్షేమ శాఖకు 1241 డబల్ బెడ్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతను అప్పచెప్పారు. రోడ్లు భవనాలకు 288, పంచాయతీ రాజ్ శాఖకు 258 గృహాల పర్యవేక్షణ అప్పజెప్పారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో 669 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. రోడ్లు భవనాల 164, పంచాయతీ రాజ్ శాఖలో 175 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఇంకా 416 డబల్ బెడ్ రూమ్ లకు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ సంఖ్యలను బట్టి తెలుసుకోవచ్చు ములుగు జిల్లాలో పనులు ఎంత నత్తనడకన సాగుతున్నాయో.


    సొంతింటి కల సాకారమయ్యేదెలా ..
    ములుగు జిల్లాకు మొత్తం 1797 డబుల్ బెడ్రూం రూములు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్లు 1008. ఇంకా పూర్తి కావాల్సినవి 789 ఉండగా వాటిలో నిర్మాణ దశలో ఉన్నవి 416. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి త్వరితగతిన డబుల్ బెడ్రూం పూర్తి చేసి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయాలనీ ములుగు జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

    ఇది చదవండి: వంకాయ కూరలో చికెన్ గ్రేవీ మిక్స్.. అర్ధరాత్రి ఆసుపత్రికి 128 మంది అమ్మాయిలు


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Mulugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు