హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS News: ఈ రోడ్డెక్కితే డైరెక్టుగా పైకి టికెట్ తీసుకున్నట్లే.. మంత్రిని నిలదీస్తున్న జనం..! ఎక్కడంటే..1

TS News: ఈ రోడ్డెక్కితే డైరెక్టుగా పైకి టికెట్ తీసుకున్నట్లే.. మంత్రిని నిలదీస్తున్న జనం..! ఎక్కడంటే..1

తాడ్వాయిలో అధ్వానంగా రోడ్లు

తాడ్వాయిలో అధ్వానంగా రోడ్లు

ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు ఎక్కడిక్కడే ధ్వంసం అయ్యాయి. రోడ్డు గుల్లబారిపోయి ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారింది. దీంతో ఈ రహదారిపైకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  "ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోరా. అధికారులూ ప్రయాణికుల ఓపికను పరీక్షిస్తున్నారా? మంత్రి పర్యటన కూడా ఈ రహదారిపై నుంచే కొనసాగుతుంది. మరి రోడ్డు సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు..." అంటూ ములుగు జిల్లా తాడ్వాయి ప్రజలు మంత్రి సత్యవతి రాథోడ్ ‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు ఎక్కడిక్కడే ధ్వంసం అయ్యాయి. రోడ్డు గుల్లబారిపోయి ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారింది. దీంతో ఈ రహదారిపైకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు రహదారి మరమత్తులు చేయలేదు.

  తాడ్వాయి పసర మధ్య రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. ఇక్కడి దుస్థితిపై స్థానికుల సహాయంతో గతంలోనే న్యూస్ 18 పలు కథనాల ద్వారా అధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రస్తుతం ములుగు జిల్లాలో పర్యటిస్తూ ఈ రహదారి గుండా ప్రయాణించారు. శనివారం కూడా మంత్రి ఈ రహదారి ద్వారానే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాగా అధికారులు హడావిడి చేస్తున్నారు. దింతో మరి సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఇక్కడి ప్రయాణికులు, స్థానికులు సూటిగా మంత్రినే ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వాహనాలు దిగబడితే ప్రయాణికుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసమే అధికారంలో ఉన్నా మా సమస్యలు నెలల తరబడి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

  ఇది చదవండి: జిల్లాలో మొట్టమొదటి సౌండ్ అండ్ లైటింగ్ సప్లయర్.., ఇప్పటికీ దసరా ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఆయనే

  తాడ్వాయి - పసర మధ్యలో ఉన్న జాతీయ రహదారి పై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అసలే పండుగ హడావుడి అనేకమంది ప్రయాణికులు సొంత గ్రామాలకు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏజెన్సీలో జాతీయ రహదారి పరిస్థితి తలుచుకుని ప్రయాణాలు చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు ప్రయాణికులు. శుక్రవారం సాయంత్రం 5:30 సమయంలో జాతీయ రహదారిపై పసర వద్ద లారీ దిగబడింది.

  దీంతో దాదాపు రెండు గంటలు మేర ట్రాఫిక్ అవగా, కిలోమీటర్ల దూరం పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక పండుగ వేళ చంటి పిల్లలతో కుటుంబ సభ్యులతో అటవీ ప్రాంతంలో నడి రోడ్డుపైన వాహనాలు నిలిచిపోతే ఆ పరిస్థితి ఏంటో మంత్రిగా తమరు కూడా ఆలోచించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ పర్యటనలో అయినా ఈ జాతీయ రహదారిని పరిశీలించి సత్వరమే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు