హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మేడారం జాతరలో స్పాట్ పెయింటింగ్ ఆర్టిస్ట్.. పది నిమిషాలలో మీ స్కెచ్ రెడీ

Mulugu: మేడారం జాతరలో స్పాట్ పెయింటింగ్ ఆర్టిస్ట్.. పది నిమిషాలలో మీ స్కెచ్ రెడీ

X
అద్భుతమైన

అద్భుతమైన నైపుణ్యం

Telangana: చిత్రకారులు తమ అద్భుత ప్రతిభతో చిత్రాలను గీస్తూ అందరి మన్ననలను పొందుతుంటారు. ఒక చిత్రకారుడు గీసిన చిత్రంలో అనేక భావాలు అర్థాలు దాగి ఉంటాయి. బయటి మార్కెట్లో చిత్రకారులు గీసిన పెయింటింగ్స్ లక్షల రూపాయల ధర కలిగి ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి

లోకేషన్ : మేడారం

చిత్రకారులు తమ అద్భుత ప్రతిభతో చిత్రాలను గీస్తూ అందరి మన్ననలను పొందుతుంటారు. ఒక చిత్రకారుడు గీసిన చిత్రంలో అనేక భావాలు అర్థాలు దాగి ఉంటాయి. బయటి మార్కెట్లో చిత్రకారులు గీసిన పెయింటింగ్స్ లక్షల రూపాయల ధర కలిగి ఉంటాయి. నేటి కాలంలో చిత్రకారులు తమ ప్రతిభకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని జోడిస్తూ వస్తున్నారు. గతంలో ఒక చిత్రాన్ని గీయాలి అంటే ఎంతో సమయాన్ని తీసుకునేవారు. కానీ ప్రస్తుతం కేవలం 10 నిమిషాలలో బొమ్మ గీయడం మనం చూస్తూనే ఉన్నాం.

ముంబై, మహారాష్ట్ర , హైదరాబాద్ , బెంగళూరు వంటి మహా నగరాలలోని పర్యాటక ప్రాంతాలలో స్పాట్ పెయింటింగ్స్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తూ ఉంటారు. కేవలం క్షణాల వ్యవధిలోనే మన బొమ్మను ఉన్నది ఉన్నట్టు గీయడం వారి ప్రత్యేకత. ఇలాంటి పెయింటింగ్స్ హైదరాబాద్ లాంటి నగరాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి.

కానీ ములుగు జిల్లాలో లాంటి ప్రాంతంలో స్పాట్ పెయింటింగ్స్ ఆర్టిస్ట్ ఉన్నారంటే మీరు నమ్ముతారా?

ఇతని పేరు అంబాల మురళి పెయింటింగ్ రంగంలో20 సంవత్సరాల అనుభవం ఉంది. ములుగు జిల్లా వ్యాప్తంగా వంశీ ఆర్ట్స్ అంటే తెలియని వారు ఉండరు. అంత కళా నైపుణ్యం ఇతని సొంతం. మేడారం జాతరకు అనేకమంది భక్తులు వస్తూ ఉండటంతో అంబాల మురళి అమ్మవార్ల గద్దెల సమీపంలో పది నిమిషాల్లో పెయింటింగ్ గీస్తూ న్యూస్ 18కి తారాసపడ్డాడు.

ఆర్టిస్ట్ మురళీ మాట్లాడుతూ..

నా పేరు అంబాల మురళి, నేను గత 20 సంవత్సరాల నుంచి అనేక చిత్రాలు గీశాను. మేడారం జాతరలో స్కెచ్ బొమ్మలు గీస్తూ ఆదాయాన్ని పొందుతున్నాను. బొమ్మను బట్టి వంద నుంచి 300 వరకు తీసుకుంటానని అంబాల మురళి చెప్పారు. స్పాట్ పెయింటింగ్స్ మహా నగరాలలో అత్యంత ప్రాచుర్యం పొందినవి కాగా.. మేడారం జాతరకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి స్కెచ్ బొమ్మల గురించి తెలిసినవారు అంబాల మురళితో స్కెచ్ బొమ్మలు గీయించుకుంటున్నారు. మరికొందరు ఫోటో దిగితే సరిపోతుంది కదా స్కెచ్ బొమ్మలు ఎందుకు అని అవగాహన లేనివారు మాట్లాడుకుంటున్నారు.

ఏది ఏమైనాప్పటికీ ఫోటో డిజిటల్ రూపంలో నుంచి కాపీలో వస్తుంది. కానీ స్కెచ్ ఆర్టిస్ట్ మాత్రం తన ప్రతిభను పెన్సిల్ తో పేపర్ పై చిత్రీకరించాల్సి ఉంటుంది. వారి హావ భావాలు, రూపం ఉన్నది ఉన్నట్టు చిత్రీకరించాలంటే మాటల్లో మాట్లాడుకునే అంత సులువైన పని మాత్రం కాదు అని కొందరు యువకులు మాట్లాడుకుంటున్నారు. అంబాల మురళి మాత్రం మేడారంలో స్పాట్ పెయింటింగ్స్ స్కెచ్ గీస్తూ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు