Venu, News18, Mulugu
మారుమూల ప్రాంతం నుంచి మిస్టర్ ఇండియా పోటీలకు కసరత్తు ప్రారంభించిన యువకుడు. అందరూ కలలు కంటారు కానీ కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు వెళుతుంటారు... చేసే పనిని ఇష్టపడుతూ జీవిత ఆశయం కోసం రాత్రింబవలు శ్రమిస్తున్న శ్రీనివాస్ రెడ్డి పై న్యూస్ 18 ప్రత్యేక కథనం. భూపాలపల్లి (Bhupalapalli) ప్రాంతం పేరు వినగానే సింగరేణి సిరులు అందరికీ గుర్తుకొస్తాయి కానీ ఇక్కడ అనేకమంది తమ విధులను నిర్వర్తిస్తుంటారు... ఇది మారుమూల ప్రాంతంగా కూడా చెప్పుకుంటారు. సింగరేణి గనులు ఉండటం వల్ల మాత్రమే భూపాలపల్లి ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి ప్రాంతం నుంచి ఒక యువకుడు మిస్టర్ ఇండియా పోటీలలో పాల్గొనడం లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. భూపాల్ పల్లి ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి మల్లక్క దంపతుల కుమారుడు శ్రీనివాస్ రెడ్డి.
శ్రీనివాస్ రెడ్డి వృత్తిరీత్యా సింగరేణిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. కానీ అతని ఆశయం అతని ఊపిరి బాడీ బిల్డింగ్ మిస్టరీ ఇండియా పోటీలలో పాల్గొని పతాకం సాధించాలనినిరంతరం కష్టపడుతున్నాడు. అతని ఆశయం కోసం సమయం దొరికినప్పుడల్లా తన బాడీపై దృష్టి పెడుతుంటాడు ఒకవైపు సింగరేణిలో ఉద్యోగం నిర్వహిస్తూనే ఖాళీ సమయంలో మిస్టర్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. 2013 నుంచి మొదలుశ్రీనివాస్ రెడ్డి తన ఆశయం కోసం 2013 నుంచి జిమ్ సెంటర్ కి వెళ్లడం బాడీని పెంచడం ప్రారంభించాడు.
అతనికి జిమ్ సమ్మన్న అనే వ్యక్తి తోడ్పాటు అందించాడు. స్వతహాగాని మెలకువలు నేర్చుకుంటూ బాడీ బిల్డింగ్ పై పూర్తి సిద్ధ పెట్టాడుశ్రీనివాస్ రెడ్డి. జైత్రయాత్ర 2014 నుంచి మొదలైంది ఏ పోటీలో పాల్గొన్న పథకం మాత్రం శ్రీనివాస్ రెడ్డిదే.అతని ప్రతిభ ఆ విధంగా ఉండేది. 2014 నుంచి 2020 వరకు వరుసగా మిస్టర్ సింగరేణి, మిస్టర్ కోల్ ఇండియా , కోల్స్ మైన్స్ కోల్ ఇండియా విభాగాలలో బంగారు పతకాలు సాధించడమే కాకుండా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా శ్రీనివాస్ రెడ్డి కైవసం చేసుకున్నాడు.
90 కిలోల విభాగంలో మిస్టర్ తెలంగాణ పోటీలలో కూడా శ్రీనివాస్ రెడ్డి బంగారు పతకం గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. తన జీవిత ఆశయం మిస్టర్ఇండియా టైటిల్ గెలుచుకోవాలని దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని.. గతంలో గెలిచిన గెలుపులను ధైర్యంగా ఉంచుకొని చేసిన తప్పులను అవగాహన చేసుకుని త్వరలో జరగబోయే మిస్టర్ ఇండియా పోటీలలో పాల్గొని పథకం సాధిస్తానని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన ఆశయానికి తోడ్పాటును అందిస్తున్న సింగరేణి జనరల్ మేనేజర్ మరియు ఇతర శ్రేయోభిలాషులకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాడు.ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి మిస్టరీ ఇండియా పోటీల్లో పాల్గొని ఆశయాన్ని చూసి మనందరం అభినందించాల్సిందే. శ్రీనివాస్ రెడ్డి పథకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana