Home /News /telangana /

MULUGU SET UP A NEW BUS DEPOT IN ETURNAGARAM PEOPLE DEMAND IN MULUGU DISTRICT SNR MMV BRV

Mulugu: మా గోడు మీకు వినపడదా: ఏజెన్సీలో బస్ డిపో ఏర్పాటు చేయరా?

(ఎందుకింత

(ఎందుకింత చిన్నచూపు)

Mulugu: ములుగు జిల్లా పరిధిలో ఏటూరునాగారం‌లో బస్ డిపో ఏర్పాటు చేస్తామని గత 25 ఏళ్లలో ఎంతో మంది రాజకీయ నేతలు, అధికారులు వాగ్దానాలు చేశారు. అయితే ఆ వాగ్దానాలు ఎన్నికల హామీలకు, పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యాయిగానీ, డిపో మాత్రం ఏర్పాటు కాలేదు.

ఇంకా చదవండి ...
  (Venu Medipelly,News18,mulugu)
  బస్ డిపో కోసం ఆ జిల్లా వాసులు ఏళ్లకేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం ఇదిగో వస్తున్నాం, అదిగో తెస్తున్నాం అంటు పైపై మాటలు చెబుతున్నారే తప్ప, కార్యాచరణ మాత్రం ప్రారంభించడం లేదు. ములుగు(Mulugu)జిల్లా పరిధిలో బస్సు డిపో ఏర్పాటుపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉమ్మడి జిల్లాగానే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోనూ ములుగు ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. పూర్వం నుంచి ములుగు రెవెన్యూ డివిజన్‌(Mulugu Revenue Division)‌గా ఉంది. ములుగు రెవెన్యూ డివిజన్‌లో భాగమైన పరకాల(Parakala), భూపాలపల్లి(Bhupalapalli)కి అధికారులు బస్ డిపో(Bus Depot)లను ఏర్పాటు చేశారు. కానీ ములుగులో బస్ డిపో ఏర్పాటు చేయడం బహుశా అధికారులకు నచ్చడం లేదు కావచ్చు.

  పేపర్ ప్రకటనలకే  పరిమితమైన హామీలు:
  ములుగు జిల్లా పరిధిలో ఏటూరునాగారం‌లో బస్ డిపో ఏర్పాటు చేస్తామని గత 25 ఏళ్లలో ఎంతో మంది రాజకీయ నేతలు, అధికారులు వాగ్దానాలు చేశారు. అయితే ఆ వాగ్దానాలు ఎన్నికల హామీలకు, పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యాయిగానీ, డిపో మాత్రం ఏర్పాటు కాలేదు. అప్పటి మంత్రి అజ్మీర చందూలాల్ ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్సు డిపో నిర్మాణం నిమిత్తం మూడు ఎకరాల భూమితో పాటు రూ. కోటి నిధులను సైతం మంజూరు చేయించినట్లు సమాచారం. అయినప్పటికీ ఏటూరునాగారం మండల కేంద్రంలో డిపో ఏర్పాటు విషయంలో నిర్మాణ పురోగతి లేదు.

  ఇది చదవండి: ములుగు జిల్లాలో కోట్లు ఖర్చు చేసి కట్టిన వంతెనలు..ఎలా ఉన్నాయో చూడండి  స్థలం ఉండి డిపో ఏర్పాటుకు ముందుకు రాని అధికారులు:
  ములుగు జిల్లా పరిధిలో ఏటూరునాగారంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులు అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా బస్ డిపో ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. బస్సు డిపో నిర్మాణం కోసం ఏటూరునాగారంలో స్థలం సేకరించి సిద్ధంగా ఉన్నా, పైఅధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఒక్కసారి మా ఏటూరునాగారం ప్రాంతానికి రావాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. డిపో లేకపోవడంతో సమయానికి బస్సులు రాక దూరప్రాంతాలకు వెళ్లే గిరిజనులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

  చుట్టుప్రక్కల 40 గ్రామాలకు రవాణా సౌకర్యం:
  ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాలకు రవాణా సౌకర్యంతో పాటు అంతర్ రాష్ట్రాలకు కూడా ప్రయాణం సులువవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్లాలన్నా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బస్సు డిపో ఏర్పాటు చేస్తే వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, బుట్టాయిగూడెం, రోయ్యురు, మంగపేట, రాజుపేట లాంటి ఎన్నో గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. 163 నెంబర్ జాతీయ రహదారి ములుగు ఏటూరునాగారం మీదుగా భూపాలపట్నం వరకు కొనసాగుతుంది. డిపో ఏర్పడితే ఈమార్గ మధ్యలో అనేక ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు.

  ఇది చదవండి : నిజామాబాద్ జిల్లాలో సెల్ఫీ వీడియో వైరల్..అందులో ఏముందో తెలుసా  అత్యవసర పరిస్థితుల్లో తప్పని తిప్పలు:
  ఏటూరునాగారం మండలం పై ఆధారపడి చుట్టుప్రక్కల చిన్న గ్రామాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం, ఇతర వ్యక్తిగత కారణాల కోసం ఏజెన్సీ నుంచి ప్రజలు ఏటూరునాగారం రావాలంటే ప్రైవేటు వాహనాలు దిక్కవుతున్నాయి. అత్యవసర సమయంలో గర్భిణీ స్త్రీలు కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకురావాలన్న ఇరుగుపొరుగు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలన్నా, పాఠశాలలకు రావాలన్నా సమయానికి బస్సులు అందుబాటులో ఉండక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు.

  ఎప్పటిలోగా నెరవేరుస్తారో ..
  ప్రత్యేక తెలంగాణలో ములుగు ఏరియా జిల్లాగా మారినప్పటికీ, జిల్లాలో బస్సు డిపో ఏర్పాటు కార్యాచరణకు నోచుకోలేదంటే అధికారుల తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. ఏజెన్సీ జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు అవసరం ఉన్నప్పటికీ.. ప్రభుత్వ అధికారులు, పాలకులు ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: పుట్టిన ఊరుపై మమకారం: సొంత డబ్బుతో బడి, గుడి నిర్మాణం


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu

  తదుపరి వార్తలు