హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: హైవే పై ఇష్టానుసారంగా లారీల పార్కింగ్ .. అక్కడ రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణం

Mulugu: హైవే పై ఇష్టానుసారంగా లారీల పార్కింగ్ .. అక్కడ రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణం

mulugu accidents

mulugu accidents

Mulugu: గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక తరలింపు విషయంలో ములుగు జిల్లా ప్రాంతంలో రోజుకు కొన్ని వేల ఇసుక లారీలు రాకపోకలను కొనసాగిస్తున్నాయి. ఈ ఇసుక లారీల వల్ల జిల్లాలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారుల దృష్టికి రాకపోవడం శోచనీయం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly,News18,Mulugu)

  గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక తరలింపు విషయంలో ములుగు జిల్లా ప్రాంతంలో రోజుకు కొన్ని వేల ఇసుక లారీలు రాకపోకలను కొనసాగిస్తున్నాయి. ఈ ఇసుక లారీల వల్ల జిల్లాలో అనేక రోడ్డు ప్రమాదాలు(Road accidents)జరిగినా అధికారుల దృష్టికి రాకపోవడం శోచనీయం. ములుగుMulugu జిల్లా ఏటూరునాగారం(Eturnagaram), మంగపేట(Mangapeta), రాజుపేట(Rajupeta), తుపాకులగూడెం(Tupakulagudem) ప్రాంతాలలో ఎక్కువగా ఇసుక రీచులు ఉంటాయి. ఇక్కడ ఇసుక లోడ్ చేసుకున్న లారీ(Lorry)లు లైన్ గా ఒకదాని వెనుక ఒకటి వరుసగా ఒకేసారి వెళ్లడంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తుంటాయి.

  Mulugu: మేడారం వనదేవతలకు బతుకమ్మ చీరలు .. తొలి చీరను సమర్పించిన మంత్రి

  రాత్రి వేళల్లో మరి డేంజర్:

  సాయంత్రం 6 దాటిందంటే వస్త్ర గ్రామం నుంచి ఏటూరునాగారం వరకు వెళ్లాలంటే వాహనదారులకు దడ పుడుతుంది. అసలే దట్టమైన అటవీ ప్రాంతం పెద్దపెద్ద చెట్లు, చిమ్మచీకటి, ఎక్కడ ఏ అడవి జంతువు అడ్డు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో వాహనదారులు కాస్త భయంగానే ఇటువైపు వెళ్తుంటారు. లారీల ఓవర్ స్పీడ్, లారీ డ్రైవర్ల అత్యుత్సాహం, ఒక లారీని మరొక లారీ పోటీపడి ఓవర్ టెక్ చేయడం వంటి చేష్టలు మిగతా వాహనదారులకు దడ పుట్టించే విధంగా ఉన్నాయి. ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితిలో హై వే పై మిగతా వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు జాతీయ రహదారి అధ్వాన్నమైన పరిస్థితి. ఎక్కడ గుంతలు ఉన్నాయో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడి ఉందో కూడా తెలియని పరిస్థితి.

  ఆర్టీవో ఉన్నాడని తెలిస్తే చాలు:

  ఇసుక లారీలను తనిఖీ చేయడానికి ఆర్టీవో అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా వాహనాలను అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటారు. పలానా ప్రాంతంలో ఆర్టీవో ఉన్నాడని లారీ డ్రైవర్లకు ఇట్టే సమాచారం అందిపోతుంది. దీంతో వందల సంఖ్యలో లారీలు జాతీయ రహదారికి ఇరుపక్కల పార్కు చేసుకొని ఉంటున్నారు డ్రైవర్లు. ఆర్టీవో, పోలీస్ అధికారుల కళ్ళ ముందే రోడ్డుకు ఇరువైపులా లారీలు ఆగి ఉన్నా వారూ పట్టించుకునే పరిస్థితి లేదు. లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేసి ఉండడంతో ఇతర వాహనదారుల ప్రాణం మీదికి తెస్తున్నాయి. ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కోకొల్లలు.

  Bhadradri: నిర్మాణం పూర్తైన ప్రారంభోత్సవానికి నోచుకోని కలెక్టరేట్ .. కారణం ఆ పెద్దసారే..!

  తనిఖీలతో హడల్..

  ఒక నేపథ్యంలో వెంకటాపురం మండలం జోహార్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఆర్టీవో వాహనాల తనిఖీ చేపట్టారు. జవహర్ నగర్ టోల్గేట్ నుంచి గుండ్లవాగు సమీపం వరకు అంటే దాదాపు పది కిలోమీటర్లకు పైగా ఇసుక లారీలు నిలిచిపోయాయి. \"ఆర్టీవో తనిఖీల నేపథ్యంలో లారీలు ఆగుతున్నాయంటే దాని అర్థం ఇసుక లారీలు ఓవర్ లోడుతో వెళ్తున్నట్టే లెక్క. లేదంటే ఎందుకు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది\" అని స్థానికులు అంటున్నారు. లారీ పరిమితికి మించిన లోడు వేసుకోవడం, లేదా లారీలకు సరియైన పర్మిషన్స్ లేకపోవడం కారణాలతో లారీ డ్రైవర్లు వాహనాలను నిలిపివేస్తుంటారు. కారణాలు ఏవైనా సామాన్య ప్రయాణికుల పరిస్థితి మాత్రం ఏజెన్సీలో అగమ్య గోచరంగా ఉంటుంది. గమ్యం చేరుకునే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు లారీ డ్రైవర్ల పార్కింగ్ విషయంలో చొరవ తీసుకొని తగు జాగ్రత్తలు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu, Telangana News

  ఉత్తమ కథలు