హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. మునిగింది 300 ఇళ్లు.. పరిహారం 130 ఇళ్లకు.. ఇదెక్కడి న్యాయం..?

Mulugu: రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. మునిగింది 300 ఇళ్లు.. పరిహారం 130 ఇళ్లకు.. ఇదెక్కడి న్యాయం..?

ములుగు

ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్వాకం

తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లా (Mulugu District) లో వర్షాలు సృష్టించిన బీభత్సానికి మారుమూల ప్రాంతమైన రామన్నగూడెం అతలాకుతలం అయింది. గోదావరి నది (Godavari River) ఉగ్రరూపానికి ముందుగా మునిగిపోయేది రామన్నగూడెమే.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  M. Venu, News18, Mulugu

  తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లా (Mulugu District) లో వర్షాలు సృష్టించిన బీభత్సానికి మారుమూల ప్రాంతమైన రామన్నగూడెం అతలాకుతలం అయింది. గోదావరి నది (Godavari River) ఉగ్రరూపానికి ముందుగా మునిగిపోయేది రామన్నగూడెమే. గతంలో కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ఏటూరునాగారం రామన్నగూడెం చుట్టుపక్కల కాలనీలను సైతం వరద ముంచెత్తింది. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులను ఇవ్వాలని నిర్ణయించింది. వరదలు తగ్గిన అనంతరం రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి వరద ప్రభావం, నష్టం పై ఒక సర్వే నిర్వహించి పరిహారాన్ని అందజేయాల్సి ఉంటుంది.

  నీట మునిగిన ఇండ్లు 300.. పరిహారం ఇచ్చింది మాత్రం 130

  వరదలు వచ్చిన సమయంలో రామన్నగూడెం సర్పంచ్ కృష్ణ, వార్డ్ మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది రెవెన్యూ అధికారులకు సహకారం అందిస్తూ గ్రామ ప్రజలను రక్షించడంలో సర్పంచ్ కృష్ణ కీలక పాత్ర పోషించాడు. వరదలు తగ్గిన అనంతరం ప్రభుత్వం పరిహారం ఇవ్వడం కోసం సర్వే నిర్వహించినప్పుడు రెవెన్యూ అధికారులు కనీసం గ్రామ సర్పంచ్‌కి సమాచారం ఇవ్వకుండానే తూతూ మంత్రంగా కేవలం 130 ఇండ్లకు మాత్రమే సర్వే నిర్వహించి లిస్ట్ తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించారు. తాను సర్పంచ్‌గా ఉన్న గ్రామానికి తనకు తెలియకుండానే సర్వే నిర్వహించి, రిపోర్టు ఉన్నతాధికారులకు ఇవ్వడంపై గ్రామ సర్పంచ్ విస్మయం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: కాలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

  "వరదల సమయంలో రెవెన్యూ సిబ్బందితో సహకరించి తమ గ్రామస్తులను కంటికి రెప్పలా కాపాడుకున్నాను.. కానీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి స్థానికంగా ఉండే విఆర్ఓ, ఆర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, తనకు తెలియకుండానే వారికి ఇష్టం వచ్చినట్లు కేవలం 130 మంది పేర్లతో బాధితుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించారు. 300 ఇండ్లు ముంపుకు గురైతే కేవలం 130 మందికి పరిహారం ఎలా ఇస్తారు" అని సర్పంచ్ కృష్ణ నిలదీయగా రెవెన్యూ అధికారుల దగ్గర సమాధానం లేకుండా పోయింది.

  అయితే మిగిలిన బాధితులు సర్పంచ్ పై ఆరోపణలు చేశారు. సర్పంచ్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా మీకు ఇందులో వాటా ఉంది అందరూ కలిసి డబ్బులు తిన్నారు అనే ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సర్పంచ్ స్థానిక ఎమ్మార్వోను వివరణ అడగగా తిరిగి సర్వే నిర్వహిస్తామని, అధికారులను పంపి మళ్ళీ సర్వే చేపడుతామని నిర్లక్ష్యపు ధోరణితో మాట్లాడినట్టు సర్పంచ్ తెలిపాడు. నెలలు గడుస్తున్నా బాధితులకు మాత్రం పరిహారం అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు చెల్లించి పూర్తి సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు