హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: రామప్ప దేవాలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడైతే.. అభివృద్ధి చేసింది కేసీఆర్!

Mulugu: రామప్ప దేవాలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడైతే.. అభివృద్ధి చేసింది కేసీఆర్!

X
రామప్ప

రామప్ప ఆలయం కీర్తి

Telangana: రామప్ప దేవాలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు అయితే 1000 సంవత్సరాల తరువాత రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి పరిచిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు

లొకేషన్ : ములుగు

రామప్ప దేవాలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు అయితే 1000 సంవత్సరాల తరువాత రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి పరిచిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

కెసిఆర్ ఆరాటం, పాలంపేట గ్రామ ప్రజల పోరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కల్వకుంట్ల కవిత రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.

దీని కంటే ముందే ములుగు సమీపంలోని ములుగు ఘట్టమ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ఇతర నాయకులతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయ పూజారులు సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా చేసిన ఘనత కేవలం ములుగు జిల్లాకే దక్కుతుందని, రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి వనరులు కేవలం ములుగు జిల్లాలోనే ఉన్నాయని, 1000 సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మిస్తే, అనంతరం దేవాలయాన్ని అభివృద్ధి పరిచిన ఘనత కేసిఆర్కే దక్కుతుందని ఆమె అన్నారు.

అదేవిధంగా ములుగు సమీపంలోని దత్తమ దేవాలయం వద్ద గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం యూనివర్సిటీ నిర్మాణంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా ములుగు ప్రజల ఆకాంక్ష మేరకైనా ములుగు ప్రాంతంలో తక్షణమే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిసారి 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ జాతర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆదివాసి గిరిజన జాతరను జాతీయ హోదా కల్పించాలని, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడున్న పరిస్థితులు చూసి చాలా బాధపడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన అనంతరం రామప్ప దేవాలయానికి పిలుస్కో గుర్తింపు వచ్చింది.

అనంతరం రామప్ప దేవాలయం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అప్పటి పరిస్థితులతో పోలిస్తే రామప్ప దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందిందని, నిజాం కాలంలో రామప్ప దేవాలయానికి ప్రత్యేక అభివృద్ధి పనులు చేశారని, వారి మరమ్మత్తుల కారణంగానే నేటి సమాజంలో రామప్ప దేవాలయం మనందరికీ చూడటానికి మిగిలి ఉందని అన్నారు. రామప్ప సందర్శనకు వచ్చిన మహిళలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలు దిగారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు