MULUGU RAMAPPA TEMPLE IS CONSIDERED TO BE AN UNDEVELOPED HERITAGE SITE SNR MMV NJ
Ramappa Temple : వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించినా రామప్ప టెంపుల్లో అభివృద్ధి ఏది..?
అభివృద్ధికి నోచుకోని రామప్ప టెంపుల్
Ramappa Temple: యూనెస్కో గుర్తింపు వచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు రామప్ప దేవాలంయ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదు. అధికారులు శ్రద్ధ పెట్టి వేగంగా అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తే..పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
(M.venu,News18,mulugu)
Ramappa Temple: ఆనాటి కాకతీయుల కళావైభవం చూడాలంటే తెలంగాణలోని వరంగల్ చుట్టు పక్కల ప్రాంతంలో ఎన్నో కట్టడాలను చూడొచ్చు.. అందులో ముఖ్యంగా రామప్ప దేవాలయం..ఆనాటి శిల్ప కళా వైభవాలకు నిలువెత్తు రూపం. ప్రపంచపర్యాటకులను సైతం ఆకర్షించిన రామప్ప కట్టడం..మన అధిఆకారుల మనస్సును మాత్రం మార్చలేకపోతుంది.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు..
కాకతీయుల కళావైభవాన్ని చాటినఆలయాన్ని 2021 జూలై(July)లో యునెస్కో(UNESCO)ప్రపంచ వారసత్వ ప్రదేశం (World heritage site)గా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు… యూనెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. భారత్(India) నుంచి రామప్పకు ప్రపంచస్థాయి ఖ్యాతి లభించింది. రామప్ప దేవాలయం(Ramappa temple)ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుని దాదాపు సంవత్సరం పూర్తి అవుతుంది. వెంటనే మన రాజకీయ నాయకులు అధికారులు, ఆకాశం అంత పందిరి వేసి అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అభివృద్ధి మాత్రం ఫోటోలకు మాత్రమే పరిమితం అయ్యింది.
రామప్ప దేవాలయం చరిత్ర..
కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా.
శిల్పి పేరు మీద దేవాలయం..
కాకతీయ రాజు ఐనా గణపతి దేవ పాలనలో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టు చరిత్రలో లిఖించబడింది. ఆలయం నిర్మాణం దాదాపు 40 సంవత్సరాల పాటు సాగింది. 40 సంవత్సరాలు పాటురామప్ప అనే శిల్పిఈ ఆలయ నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమించాడు. దానికి బదులు గానే ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ విధంగా ఒక శిల్పి పేరుమీద దేవాలయం మరెక్కడా లేదు. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దేవాలయం మండపానికి బయటి భాగంలోనాలుగు పక్కలా అమర్చిన పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు కాకతీయుల శిల్పకళా వైభవాన్ని చూపిస్తాయి.
శాసనం కోసమే ప్రత్యేక మండపం..!
ప్రతి గుడి నిర్మాణానికీ కొన్ని శాసనాలు ఉంటాయి. కాలక్రమేణా వాటిలో కొన్ని పాడవుతుఉంటాయి. ఈ గుడిని కట్టిన వాళ్లు శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రపంచ గుర్తింపు పొందినా..మన అధికారులు కనీసం ఆలయ ప్రధాన ప్రహరీ కూడా బాగు చేయలేకపోయారు. ఇప్పటికీ రామప్పలో పరిస్థితిఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. పురాతన ఆలయాన్ని తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ద్వారా దాదాపు 40 -50 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది. కానీ తప్పకుండా కొన్ని అభివృద్ధి పనులు చేయాలని కేంద్ర పర్యాటకశాఖ సూచించింది. దానిలో భాగంగా పర్యాటకులకు విశ్రాంతి గదులు, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి ఈ జాబితాలో చేర్చారు.
ఇప్పటికైనా పట్టించుకుంటారా..
అలాగే రామప్ప దేవాలయం ఆలయప్రాంగణంలో ఉన్న కామేశ్వర ఆలయం కూడా పునర్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఆలయ పునర్నిర్మాణం పక్కనపెడితే ఆలయ ప్రధాన ప్రహరీ చాలా వరకు శిధిలం ఔతుంది. ప్రభుత్వం చొరవచూపాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని రామప్ప దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కాకతీయుల కళా సంపదను రాబోయే భావితరాలకు చూపించే విధంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
టైమింగ్స్ : వారం రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది.
ఎలా వెళ్లాలి : ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ వరకు విమాన సౌకర్యం ఉంటుంది. అక్కడ నుంచి రైలులో కానీ, బస్సులో కాని వరంగల్ వెళ్లొచ్చు. రైలు సౌకర్యం అయితే వరంగల్ వరకు వెళ్లి..అక్కడ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.