హోమ్ /వార్తలు /తెలంగాణ /

Godavari villages: గోదారి.. ఆ ఊరికి దారేది: ముంపు ప్రాంత వాసుల ఆవేదన అధికారులకు పట్టేనా?

Godavari villages: గోదారి.. ఆ ఊరికి దారేది: ముంపు ప్రాంత వాసుల ఆవేదన అధికారులకు పట్టేనా?

గోదావరి

గోదావరి ముంపు మార్గం

భారీ వర్షాలు వచ్చాయంటే చాలు ఆ గ్రామం పేరు వార్తలలో నిలుస్తుంది. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల హడావుడి ఆకాశాన్ని తాకుతుంది. ఆ హడావిడిని చూసి గ్రామస్తులు మా ఊరు నిజంగానే బాగుపడుతుందేమో అని అనుకుంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  భారీ వర్షాలు (Heavy rains)వచ్చాయంటే చాలు ఆ గ్రామం (Village) పేరు వార్తలలో నిలుస్తుంది. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల హడావుడి ఆకాశాన్ని తాకుతుంది. ఆ హడావిడిని చూసి గ్రామస్తులు మా ఊరు నిజంగానే బాగుపడుతుందేమోఅని అనుకుంటారు. కానీ వర్షాలు తగ్గిపోతాయి వరదలు తగ్గిపోతాయి వరదలతో పాటే అధికారుల రాజకీయ నాయకుల హడావుడి తగ్గిపోతుంది. సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నా చందంగా ఉంటుంది.

  ములుగు (Mulugu) జిల్లా ఏటూర్ నాగారం మండలం రామన్నగూడెం గ్రామం (Ramanna Gudem) గోదావరి నదికి పక్కనే ఉంటుంది. 1980వ దశకంలో వచ్చిన గోదావరి వరదలు ఆ ఊరిని చుట్టుముట్టగా, అనంతరం గోదావరి నదికి ఆ గ్రామానికి మధ్యలో కరకట్టను నిర్మించింది ప్రభుత్వం. కానీ ఏం లాభం గోదావరి నది (Godavari river) ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారి ఆ గ్రామం విలవిలలాడిపోతుంది. కరకట్ట తెగిపోయి గోదారి ఆ గ్రామానికి దారి లేకుండా చేస్తుంది. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు రామన్నగూడెం కరకట్ట పూర్తిగా ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలోనే కరకట్ట మరమ్మతులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 130 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టింది. ధ్వంసమైన కరకట్టకు మరమ్మతులు చేయడానికి రెండు భారీ యంత్రాలు, రోడ్డు రోలర్ కట్టపై కనిపించాయి.

  ముంపు గ్రామాల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ..

  ధ్వంసమైన కట్టపై ఉన్న రైతులతో అక్కడే ఉన్న న్యూస్ 18 ప్రతినిధి మాట్లాడగా కరకట్ట నిర్మాణ పనుల పరిశీలన కోసం ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమత్ జగదీష్ వచ్చినప్పుడు రైతులతో చర్చించి కరకట్ట పటిష్టంగా ఎలా నిర్మించాలనే విషయంలో రామన్నగూడెం రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన అనంతరం కరకట్ట శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారట. గ్రామస్థులు చెప్పిన దాని ప్రకారం.. ఇటీవల ముంపు గ్రామాల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా చెప్పిన మాట 'గోదావరి ఆనకట్ట పక్కనే రామన్నగూడెం గ్రామం ఎప్పటికైనా ప్రమాదకరం' అని. అలాని గ్రామం మొత్తాన్నివేరే గడ్డ ప్రాంతానికి తరలించాలంటే సాధ్యం కానీ విషయం.

  ఇక గ్రామంలో మహిళల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. \"మొన్న వచ్చిన వరదలకు గోదావరి నది పొంగి నీరంతా ఇండ్లలోకి వచ్చింది. కరకట్ట ఎప్పుడు తెగుతుందో తెలియదు. గోదావరి నది అమాంతం ఊరును మింగేసే పరిస్థితి వచ్చింది. కట్టు బట్టలతో అర్ధరాత్రి పిల్లలను చంకను ఎత్తుకొని పరుగులు తీశాం\" అని భయానక వాతావరణాన్ని గుర్తుచేసుకున్నారు. రామన్నగూడెంలో కాస్తోకూస్తో కూడబెట్టుకున్నవారు ఇతర గ్రామాలలో ఇండ్లు నిర్మించుకొని వెళ్లిపోయారు. లేనివారు ఇక్కడే పనులు చేస్తూ బతుకుతున్నారు. వరదలు వచ్చినప్పుడు మేమున్నామంటూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేస్తారని, వారికి మా బాధ ఎలా అర్ధం అవుతుందని మహిళలు ప్రశ్నిస్తున్నారు. బయటకు వెళ్లి బతకాలంటే డబ్బులు లేవు, ఇక్కడ బతకాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆశకు అవసరానికి మధ్యలో బతుకుతున్నామని మహిళలు తమ గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా రామన్నగూడెం ప్రజలకు ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Floods, Local News, Mulugu, Rains

  ఉత్తమ కథలు