Home /News /telangana /

MULUGU RAJINIKANTH THE INTERMEDIATE STUDENT FROM MULUGU DISTRICT MAKE HIS DREAM COME TRUE BA MMV BRV

మీట్ ది రజినీకాంత్.. ఖోఖో స్టార్.. ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న మన తెలుగు కుర్రోడు..

రజినీకాంత్

రజినీకాంత్ (File )

రజినీకాంత్. ఈ పేరు వినగానే తమిళ సూపర్ స్టార్ గుర్తొస్తారు. ఆయన పేరే పెట్టుకున్న ఈ కుర్రాడు కూడా తక్కువేం కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎన్నికయ్యేలా శ్రమించడం అంటే మాటలు కాదు. అతడి శ్రమ, దీక్ష అందుకు నిదర్శనం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Adilabad | Khammam | Nizamabad
    అదొక మారుమూల పల్లె ప్రాంతం. బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండీలేనట్టుగా ఉండే ఆ పల్లెలో...చిన్న ఇరుకు ఇంటిలో నివసిస్తుంది ఆ యువకుడి కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబం నుంచి.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బయటకు వచ్చిన ఆ యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ ఆటల పోటీల్లో రాణిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున బంగారు పథకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడు త్వరలో నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు సైతం అర్హత సాధించి శెభాష్ అనిపించాడు. ఆ యువకుడి పేరు కావేరి రజినీకాంత్.

    ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం బుట్టాయిగూడెంకు చెందిన కావేరి రజినీకాంత్...హనుమకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో ఆటలో ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున బంగారు పతకం సాధించాడు. ఆ యువకుడి వెతుకుంటూ న్యూస్ 18 ప్రతినిధి బుట్టాయిగూడెంకు చేరుకున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం. కావేరి పద్మ, సమ్మయ్య దంపతులకు రజనీకాంత్ రెండవ సంతానం. చిన్నప్పటినుంచి రజనీకాంత్‌కు ఆటలు అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే చదువు కొనసాగిస్తున్నాడు. రోజు సాయంత్రం మాత్రం తనకు ఇష్టమైన ఆటను ప్రాక్టీస్ చేస్తున్నాడు రజినీకాంత్.



    వ్యాయామ ఉపాధ్యాయుడు రబ్బానీ పర్యవేక్షణలో ఆటలో మెలుకువలు నేర్చుకున్నాడు. ఖాళీ సమయంలో యూట్యూబ్ చూసి కూడా మెలుకువలు నేర్చుకున్నాడు. ఇక ఈ చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి ఖోఖో ఆటగాడిగా రజినీకాంత్ మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు రాష్ట్రానికి పతకాలు అందిస్తుండడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారికి తప్పకుండాప్రోత్సాహం అందించాలని గ్రామస్తులు కోరారు.

    Nagarkurnool: తెలంగాణ రాబిన్​హుడ్​ "పండగ సాయన్న": ఆయన చరిత్ర ఇదే..



    ప్రభుత్వ ప్రోత్సాహం కరువు: ఇంత ఘనత సాధించిన రజినీకాంత్‌కు ప్రోత్సాహం కరువైంది. మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సాగిన తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నాడు రజనీకాంత్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారులకు సరైన సదుపాయాలు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామని రజినీకాంత్ కోరుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు