రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లోకేషన్ : ములుగు
ఆదివాసీ నాయకపోడు గట్టమ్మఆలయ శుద్ధిపండగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి ప్రజల ఆచారపు వ్యవహారాలు అలవాట్లు వారి పూజా విధానం చాలా వైవిధ్యభరితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ములుగు జిల్లా లాంటి ప్రాంతంలో గిరిజన ఆచారపు అలవాట్లు అందరిని ఆకట్టుకుంటాయి. మేడారం మహా జాతర సమయంలో ఆదివాసీల సాంప్రదాయం మనం చూడవచ్చు.
ఆదివాసీ నాయక పోడు గిరిజన యువకుడు సురేందర్ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ జాతర వద్ద శుద్ది పండగపూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఆదివాసులకు పండగ దినం అంటే మాఘ శుద్ధ పౌర్ణమి అని అన్నారు. ఈ మాఘశుద్హ పౌర్ణమి దినాలలో మాత్రమే ఆదివాసులజాతరలు దేశంలో ఎక్కడైనాజరుపుకుంటారని అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా జాతర శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకొని ములుగు గట్టమ్మదేవాలయం వద్ద ఎదురు పిల్ల పండగ చేయడం జరుగుతుందని అన్నారు.
ఆదివాసి నాయకపోడు గట్టమ్మ పూజారులుగా మా తాతల తరాన్ని నాటి నుండి నేటి వరకు పూజలు కొనసాగిస్తూ ఈ ఎదురు పిల్ల పండగ నిర్వహించబడుతుందని అన్నారు.ఈ ఎదురు పిల్ల పండగను తేదీ ఈనెల 25న బుధవారం రోజునఈ కార్యక్రమం నిర్వహినుంచబడుతుందన్నారు.
ఆదివాసి నాయకపోడు ఘట్టమ్మ శుద్ధి కార్యక్రమంలో గట్టమ్మ ఆలయాన్ని నీటితో శుభ్రంగా కడిగి, ఆలయానికి, గుడి గద్దెలకు రంగులు వేసి డప్పు వాయిద్యాలతో ఈ కార్యక్రమం చేస్తారని అన్నారు. ములుగు ఆదివాసి నాయకపోడు కులస్తులందరూ కలిసి ఇంటికో బోనం చేసిఆదివాసి నాయక పోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇలవేల్పుల లక్ష్మి దేవరతో అంగరంగ వైభవంగా సన్నాయి మేళాలతో ఈ ఎదురు పిల్ల పండగను నిర్వహించబడుతుందని అన్నారు.
ఆదివాసి నాయక పోడుల కులదైవమైన లక్ష్మీ దేవర్లతో ఆదివాసి సంస్కృతులప్రకారం పూజా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ పూజలో భాగంగా ఆదివాసి నాయకపోడ్ గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఉదయాన్నే 5 గంటలకు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి అమ్మవారికి దీపం ముట్టించి ఉపవాసంతో బోనం వండడం జరుగుతుందని అన్నారు. ఇంటిలో నుండి బోనం ఎత్తుకొని దీపంతో కాళ్లకు చెప్పులు లేకుండా ములుగు గ్రామం నుండి గట్టమ్మ దేవాలయం వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉపవాసం ఉంటూ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఆ ఉపవాసం విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana