(Venu Medipelly, News18, mulugu)
ఈ నెల 15 నాటికి ప్రతి మండలంలో నాలుగు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లాకలెక్టర్ యస్.క్రిష్ణ ఆదిత్య ఆదేశించారు. మన ఊరు - మన బడి పనుల పురోగతి పెంచాలి. మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో నాలుగు పాఠశాలను ఈ నెల 15 నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. అధికారులతో కలెక్టర్ భేటీ విద్యాశాఖ, ఈఈలు, డిప్యూటిఈఈలు, ఏఈలతో మన ఊరు మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా చేపడుతున్న పాఠశాలల పునరుద్దరణలో నాణ్యత ప్రమాణాలు పాటించి జిల్లాలోని 125 పాఠశాలల్లో మండలానికి నాలుగుపాఠశాలల చోప్పున అన్ని పాఠశాలల్లో విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, డిజిటలైజేషన్ మొదలగు వాటిని సమకూర్చి మోడల్ పాఠశాలలుగా అభివృద్ది చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో రన్నింగ్ బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, కిచేన్ షెడ్ లు, టాయిలెట్లలను ఏర్పాటు చేయాలని, ప్రతి తరగతి గదిలో వాల్ పుట్టిని, పెయింటింగ్ పనులను చేపట్టాలని, పాఠశాలల్లో విద్యూత్ సౌకర్యాన్ని కల్పించాలని, ఫర్నిచర్, డిజిటలైజేషన్ విధానం అమలు చేయాలని, సానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల కొరకు మంచి నీటిని సౌకర్యాన్ని తప్పక సమకూర్చాలని పేర్కోన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ప్రహరీలు, తరగతి గదులలో ఫ్లోరింగ్, అదనపు గదులు, మరమ్మత్తులు మొదలైన వాటి ప్రగతిని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తూ,కొన్ని మండలాలలో, కొన్ని పాఠశాలల్లో ఫోటోలను గమనించి పనుల ప్రగతిని, అధికారులను అడిగి అరా తీశారు. పనులు జరిగి, ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ చేయబడితేనే డబ్బులు వస్తాయని, పనులు త్వరగా పూర్తిచేసి ఫోటోలను అప్లోడ్ చేయాలని అధికారులను సూచించారు.
పాఠశాలలో తరగతి గదులలో, వరండాలో చక్కని టైల్స్ తో ఫ్లోరింగ్ చేయాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల తాజా పరిస్థితిని ఫోటో తీసి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని, డబ్బులకు కొరత లేదని, మీరు పనులలో ప్రగతిని చూపించాలని తెలిపారు. జిల్లాలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్మించే టాయిలెట్స్ సైజ్ పై శ్రద్ద వహించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana