హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఇంటినే పేకాట క్లబ్‌గా మార్చేసిన బిజినెస్‌మెన్ .. ఎక్కడో..? ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా..?

Mulugu: ఇంటినే పేకాట క్లబ్‌గా మార్చేసిన బిజినెస్‌మెన్ .. ఎక్కడో..? ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా..?

POKER CLUB

POKER CLUB

Mulugu: పేరుకు మాత్రం పెద్దమనిషి.. బయట ప్రపంచంలో ప్రముఖ వ్యాపారిగా చలామణి. కానీ అతని ఇంటిని పేకాట క్లబ్‌గా మార్చేశాడు. బడా బాబులతో కలిసి ఇంటిలోనే పేకాట మొదలుపెట్టాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly,News18,mulugu)

  పేరుకు మాత్రం పెద్దమనిషి.. బయట ప్రపంచంలో ప్రముఖ వ్యాపారిగా చలామణి. కానీ అతని ఇంటిని పేకాట క్లబ్‌గా మార్చేశాడు. బడా బాబులతో కలిసి ఇంటిలోనే పేకాట( Poker)మొదలుపెట్టాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఎన్ఎస్ఆర్ హోటల్(NSR Hotel)యజమాని సంపత్ రావు ఇంటిపై ఆదివారం(Sunday)అర్ధరాత్రి దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ (Task Force)అదనపు డిసిపి వైభవ్, సిఐ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో హోటల్ ఓనర్ నాయినేని సంపత్ రావు(Naineni Sampath Rao)ఇంట్లో సోదరులు నిర్వహించగా తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి మొత్తం రూ. 3 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  Nagarkurnool: కొడుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదని కన్నతల్లి ఏం చేసిందో తెలుసా..?  మామను చంపిన అల్లుడు..

  మామను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన అల్లుడు: సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న తన మామను చంపితే.. కారుణ్య నియామకాల ద్వారా ఆ ఉద్యోగం తనకు దక్కేలా ఓ అల్లుడు...మామను ట్రాక్టర్ తో గుద్ది చంపాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ...భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదెలు సింగరేణి ఉద్యోగం చేస్తుంటాడు. బండారి ఓదెలుకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగురు కుమార్తెలు, చిన్న భార్యకు ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు. అయితే బండారి ఓదెలు తన సింగరేణి ఉద్యోగాన్ని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చిన్న భార్య కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్ద భార్య రెండో అల్లుడు నక్క రమేష్...మామ పై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మామను హతమారిస్తే కారుణ్య నియామకాల్లో ఆ ఉద్యోగం తనకు వస్తుందని భావించిన రమేష్... వెంకటేశ్వరపల్లి గ్రామం వద్ద విధులు నిర్వహించుకొని తన ద్విచక్ర వాహనం పై వస్తున్న మామ ఓదెలును ట్రాక్టర్‌తో గుద్ది చంపాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  మామ ఉద్యోగం కోసం కిరాతకం..

  అయితే మరణించిన బండారి ఓదెలుపై మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదయింది. ఓదెలు పెద్ద భార్యను పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్తానని ఇంటి నుంచి తీసుకొచ్చిన ఓదేలు మహాదేవపూర్ అటవీ ప్రాంతంలో హత్య చేశాడట. ఈ విషయంలోనే ఓదెలు అతని చిన్న భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద భార్య మరణం అనంతరం వారి బంధువులతో భూ సమస్యలు ఉన్నాయని ఓదెలు గణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఒకవైపు భార్యను చంపిన భర్త, ఉద్యోగం ఇవ్వలేదని అల్లుడు, భూ తగాదాలు ఇవన్నీ కలిసి చివరికి ఒక ప్రాణాన్ని తీసేవరకు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న గణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu, Telangana crime news

  ఉత్తమ కథలు