Home /News /telangana /

MULUGU PRIMITIVE HUMAN CAVE PAINTINGS FOUND IN ETURUNAGARAM FOREST RANGE IN MULUGU DISTRICT MMV BRV PRV

Mulugu: ములుగులోని ఆ కొండపై ఆదిమ మానవుడు నివసించాడా? ఆ చిత్రాలు ఆదిమ మానవుడు గీసినవేనా?

వేల

వేల సంవత్సరాల నుంచి చెక్కుచెదరని చిత్రాలు

దట్టమైన అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఆదిమ మానవుల చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేసే క్రమంలో న్యూస్ 18 ఒక సాహస యాత్రే చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఆదిమానవులు గీసిన చిత్రాల కోసం న్యూస్ 18 అన్వేషణ

    (Venu Medipelly, News18, mulugu)

    నాగరికతకు బీజం వేస్తూ కాలక్రమంలో మానవుడు నేర్చుకున్న అంశాలలో చిత్రలేఖనం ఒకటి. భాష, లిపి కనుగొనడం కంటే ముందే చిత్రాలు గీయడం నేర్చుకున్న ఆదిమ మానవుడు తమ జీవన కాలంలో తాము ఎదుర్కొన్న, చూసిన సంఘటనలను చిత్రాల రూపంలో తరువాతి తరాలకు తెలియజేశాడు. ప్రస్తుతం అక్కడక్కడా కొండలు, గుట్టల్లో చరిత్ర పరిశోధకుల అన్వేషణలో బయటపడుతున్న ఆ చిత్రాల చూస్తే ఆదిమ మానవుడి జీవన శైలి ఏ విధంగా ఉండేదో అర్ధం అవుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఆదిమ మానవుల చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేసే క్రమంలో న్యూస్ 18 ఒక సాహస యాత్రే చేసింది. విభిన్నమైన ప్రత్యేక కథనాలు అందించడంలో న్యూస్ 18 ఎప్పుడు ముందుంటుంది. ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ (Narsapur) అటవీ ప్రాంతంలో ఆదిమానవులు గీసిన చిత్రాలు (cave paintings) ఉన్నాయనే సమాచారం తెలుసుకున్న ములుగు న్యూస్ 18 బృందం వాటి కోసం అన్వేషిస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది.

    కొండ రాళ్లపై ఆదిమ మానవులు గీసిన చిత్రాలు:

    ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ గ్రామం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద బండ రాళ్ళపై చిత్రాలు ఉన్నాయని వాటిని ఆదిమ మానవుడే (Primitive man)గీసి ఉంటాడని తెలుసుకుని వాటి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో అన్వేషణ మొదలుపెట్టింది. దట్టమైన అటవీ ప్రాంతం గుండా ట్రెక్కింగ్ చేసుకుంటూ దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ అన్వేషణ అనంతరం ఒక పెద్ద బండరాయిపై వివిధ చిత్రాలు ఉండడం కనిపించింది. ఇక్కడున్న గుట్టను స్థానికులు బొమ్మలలోది అని పిలుస్తారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం చాలా సంవత్సరాల నుంచి ఈ చిత్రాలను గమనిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ చిత్రాలను ఆదిమా మానవుడే గీసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

    ఆదిమానవుడే చిత్రీకరించాడా?:

    ఇక్కడున్న ఈ చిత్రాల (Cave Paintings) గురించి గతంలో ఎవరికీ పెద్దగా తెలియదు. ములుగు జిల్లా అడవుల్లో చుట్టుపక్కల ఉన్న చరిత్ర ఆనవాలు ప్రకారం ఈ గుట్టలకు సమీపంలో ఉన్న గ్రామాలలో ఆదిమ మానవుల సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమాధులు ఉన్నాయంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదిమానవుడు సంచరించినట్లు తెలుస్తుంది. ఇక్కడ నివసిస్తున్న సమయంలోనే ఆదిమా మానవుడే ఈ చిత్రాలను గీసి ఉంటాడని భావించవచ్చు. ఆదిమానవుడు వేటే ప్రధాన వృత్తిగా జీవించాడని చరిత్ర చెబుతుంది. అటవీ జంతువులను వేటాడి ఆదిమానవులు తమ ఆకలిని తీర్చుకునేవారని సంగతి తెలిసిందే.

    ఆదిమానవుడు వేటకు వెళ్లే క్రమంలో ఎలాంటి జంతువులను చూశాడో ఎలాంటి క్రూర మృగాలు తనకు ఎదురయ్యాయో తన దైనందిన జీవితంలో జరిగిన విషయాలను ఇలా చిత్రాల రూపంలో గీసి ఉంటాడని అర్ధం అవుతుంది. ఎద్దు, జింక, దుప్పి చిత్రాలతో ఆదిమ మానవుడు కలిసి ఉన్న చిత్రాలు చూస్తుంటే..మానవుడు సంఘజీవి అని చెప్పుకోవచ్చు. మానవుని సంఘంతో కలిసే క్రమంలో ఎద్దు కూడా మానవుని జీవన విధానంలో కలిసిపోయింది. నేటికీ మనం ఎద్దులు వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశంలో అంతరించిపోయే వన్యప్రాణులలో అడవి దున్నలు అగ్ర స్థానంలోనే ఉన్నాయి. కానీ అడవి దున్నలు నేటికీ సజీవంగా, స్వేచ్ఛగా సంచరించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీ ప్రాంతమే. ములుగు జిల్లా అరణ్యంలో ఇప్పటికీ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా దుప్పులు, జింకలు, అడవి దున్నలు ఉన్నాయి.

    యుద్ధాన్ని ప్రతిబింబించే చిత్రాలు: ఇక్కడ ఆదిమ మానవుడు గీసిన చిత్రాలలో మానవుడు యుద్ధం చేసే సన్నివేశాలు కూడా ఉండడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చరిత్ర చెప్తున్న దాని ప్రకారం చూస్తే.. సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రకారం ప్రాకృతిక వ్యవస్థలో మనుషుల మధ్య ఘర్షణలు జరిగాయని అర్ధం అవుతుంది. అంటే మానవుడు గుంపులుగా ఏర్పడి నాగరికత తెలుసుకునే సమయానికి ఆదిమ మానవుల్లో కూడా స్వార్థం అనే భావన వచ్చి ఉంటుంది. దానిలో భాగంగానే ఆదిమ మానవుల మధ్య కూడా ఘర్షణలు జరిగినట్టు ఈ చిత్రాల ద్వారా తెలుస్తుంది.

    ఆదిమానవుల నివాస కేంద్రమా?:

    ఆదిమానవులు గీసిన ఈ వర్ణ చిత్రాలు (Colored Pictures) ఉన్న ప్రదేశం ఒకప్పుడు వారికి నివాస కేంద్రంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడున్న ఒక పెద్ద బండరాయి (Rock).. గుహ ఆకారంలో నివాసానికి అనుగుణంగా ఉండటమే ఈ అనుమానానికి దారితీస్తుంది. ఈ వర్ణ చిత్రాలు ఉన్న సమీపంలోనే గుట్టపై మంచినీటి బావి కూడా ఉంది. దీంతో ఆదిమ మానవుడు ఇక్కడ నివాసం ఏర్పరుచుకుని ఉంటాడని, అటవీ జంతువులను వేటాడి తమ ఆకలిని తీర్చుకుంటూ ఇక్కడున్న మంచినీళ్ల బావిని ఉపయోగించినట్లు కూడా తెలుస్తుంది. ఆదిమానవుడు ఇక్కడ నివసించాడు కాబట్టే ఈ చిత్రాలను గీసి ఉంటాడని ఒక ప్రాథమిక అంచనా..

    రూట్ మ్యాప్ (Route map): ములుగు జిల్లా కేంద్రం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి (Tadvai) మండల కేంద్రంగా నర్సాపూర్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామ సమీపంలో దట్టమైన అటవీ కొండల శ్రేణి విస్తరించి ఉంటుంది. మూడు గుట్టల మధ్యలో ఈ చిత్రాలు ఉన్న గుట్ట (hill)ఉంటుంది. స్థానికుల సహాయం లేకపోతే ఇక్కడికి కొత్తవారు చేరుకోలేరు. స్థానికంగా ఉండే కొందరు యువకులు పర్యాటకులను ఇక్కడికి తీసుకువచ్చి కొంత ఉపాధి పొందుతున్నారు.

    శ్రీకాంత్, లోకల్ గైడ్ 9490325424
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Best tourist places, Forest, Local News, Mulugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు