MULUGU PHYSICAL DIRECTORS WANTING TO PASS PHYSICAL EVENTS FOR TELANGANA UNIFORM JOBS SNR MMV NJ
Telangana: ఫిజికల్ ఈవెంట్స్ పాసైతేనే యూనిఫామ్ జాబ్స్ .. అభ్యర్ధులకు గుడ్ అడ్వైజ్
(ఆ ఉద్యోగాలకు ఫిట్నెస్ మస్ట్)
Telangana Jobs: తెలంగాణ యూనిఫామ్ జాబ్స్‌కి ఫిజికల్ ఈవెంట్స్ పాస్ కావాలంటున్న ఫిజికల్ డైరెక్టర్స్, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత యువత యూనిఫామ్ జాబ్స్పైన ఫోకస్ పెట్టారు. అయితే ఫిటికల్ డైరెక్టర్స్ మాత్రం ఉద్యోగ సాధనలో ఫిజికల్ ఈవెంట్స్ ముఖ్యమని సూచిస్తున్నారు.
(Venu Medipelly,News18,Mulugu)
Uniform Jobs: తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం కొలువుల పండగ కొనసాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి యూనిఫామ్ జాబ్స్ పై యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 17,516 యూనిఫామ్ జాబ్స్Uniform Jobs కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ (Government Notification)విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మంది అభ్యర్దులు దరఖాస్తు చేసుకున్నారు.
ఉద్యోగం కావాలంటే ఇవి ముఖ్యం..
ఈ నోటిఫికేషన్లో (Notification) ప్రిలిమినరీ పరీక్షలో (preliminary exam) మార్కుల కోత విధానం అవలంభిస్తున్నారు. తరువాత నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్ లో 800/100 మీటర్స్ పరుగును తొలగించారు. అమ్మాయిలకు 100 మీటర్ల రన్నింగ్‌ను తొలగించారు..కొత్తగా అమ్మాయిలకు 800 మీటర్ల రన్నింగ్‌ని…. అబ్బాయిలకు 1600 మీటర్లని చేర్చారు.
ఏ యూనిఫామ్ జాబ్స్కైనా ఫిజికల్ ఈవెంట్స్ చాలా ముఖ్యం. మరి శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం లేదు. అబ్బాయిలకు ఫిజకల్ ఈవెంట్స్ 1. 1600 మీటర్ల రన్నింగ్‌ని 7 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 2. 4 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. 3. 7.26 కేజీ లు ఉన్నా షాట్ పుట్ నీ 6 మీటర్ల దూరం వేయాలి.
అమ్మాయిలకు ఫిజికల్ ఈవెంట్స్ 1. 800 మీటర్స్ రన్నింగ్‌ని ఐదు నిమిషాల 20 సెకండ్స్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 2. 2.50 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. 3. 4 కేజీలు ఉన్నా షాట్ పుట్ని 4 మీటర్ల దూరం వేయాలి.
ఫిజికల్ ఈవెంట్స్ ముఖ్యం..
చాలామందికి ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి గ్రౌండ్ లో మెరిట్ ఎలా సాధించాలి అనే అంశాలు తెలియకుండానే రన్నింగ్ చేస్తున్నారు. అలా చేస్తే గ్రౌండ్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని సీనియర్ కోచ్ లు అంటున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ కూడా ఒక విధానం ప్రకారం చేయాల్సి ఉంటుంది.
ఇవే రూల్స్ ..
అబ్బాయిలు 1600 మీటర్స్ అమ్మాయిలకు 800 మీటర్లు కీలకంగా ఉన్నాయి… కాబట్టి రోజు వారి ప్రాక్టీస్‌ను ఇప్పటి నుంచే ప్రారంభించాలి. అందరూ కూడా షూస్ వేసుకొని రోడ్లపై రన్నీంగ్ చేస్తున్నారు. కానీ అలా రన్నింగ్ చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్దులు దగ్గరలో ఉన్న గ్రౌండ్స్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అభ్యర్థులు ఎక్కువ మంది ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయ్యాకే గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. అలా చేస్తే ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయినా కూడా గ్రౌండ్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారు.
సీనియర్ డైరెక్టర్ల సూచనలు..
రన్నింగ్ చేసే ముందు బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవాలి. ప్రాక్టీస్‌లో భాగంగా రన్నింగ్‌కి ముందు ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలో పైన వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ పద్మ రన్నింగ్ ప్రాక్టీస్ లో భాగంగా రన్నింగ్ కి ముందు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏవిధంగా చేసుకోవాలో వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.