Venu, News18, Mulugu
భారతదేశానికి (India) గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) అభివర్ణించారు. దేశంలోని గ్రామాలు ఎప్పుడైతే పూర్తిగా అభివృద్ధి చెందుతాయో.. దేశం కూడా అభివృద్ధి బాటలో సాగుతోంది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించారు. అనంతరం గ్రామ పంచాయితీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజల జీవన విధానం, ఉపాధి, ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం అందిస్తుంది. దీనిలో భాగంగానే గ్రామ పంచాయితీలు ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గాను వాటికి ప్రభుత్వాలు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులను అందిస్తుంది.
ములుగు జిల్లా (Mulugu District) గిరిజన ప్రాంతమైనప్పటికీ 200కు పైగా గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరి అంశాలలో అవార్డ్స్ లభించాయి. వీటిలో 27 గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అవార్డ్స్ లభించాయి. అంతేకాకుండా రాష్ట్ర స్థాయికి సైతం 12 గ్రామపంచాయతీలను ఎంపిక చేసినట్లు ములుగు జిల్లా స్థానిక సంస్థ అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. వచ్చే ఏడాదిలో జాతీయస్థాయి అవార్డు సాధించడం కోసం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ మెరుగైన సేవలు అందిస్తామని అధికారులు చెప్తున్నారు.
గిరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో సంక్షేమ అభివృద్ధి పథకాలు, గ్రామ అభివృద్ధి కోసం సమిష్టి కృషి వల్ల జిల్లాను ప్రగతి పథంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. గిరిజన ప్రాంతమైనాజిల్లా సర్వతో ముఖాభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులుసమిష్టి కృషితో పనిచేస్తున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో జిల్లా అధికార యంత్రాంగం,పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, వైద్యా, ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతోకృషి చేస్తున్నారు.
జిల్లాస్థాయి, జాతీయ పంచాయతీల అవార్డు ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధి కోసంసర్పంచులు, కార్యదర్శులు ప్రణాళిక బద్ధంగా స్కూల్ బిల్డింగ్, సిసి రోడ్ల నిర్మాణం,నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు క్లీన్ అండ్ గ్రీన్, బాల్యవివాహాల నిర్మూలన, స్వచ్ఛభారత్ వంటి అంశాలలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలను ప్రగతి పథంలో నిర్విరామంగా కృషి చేయాల్సి ఉంటుంది. 27 మంది అవార్డులు పొందిన వారికి అధికారులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రానున్న రోజులలో మీపై ఎక్కువ బాధ్యత ఉంటుందని, పోటీతత్వం కూడా అలవర్చుకోవాలనిసూచించారు.
ఈ నేపథ్యంలో న్యూస్ 18 ప్రతినిధి ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో ముచ్చటించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఈ ప్రక్రియ నిర్వీరమంగా కొనసాగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంజిల్లా అధికారులు అందరూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ గ్రామాలలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేలో కృషి చేస్తున్నారన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు గ్రామ అభివృద్ధిపై అవగాహన కల్పించడం ఈ అవార్డుల యొక్క ప్రత్యేకతని వివరించారు. ఈనెల 30వ తేదీన రాష్ట్రస్థాయి అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. మన జిల్లా నుండి కుడా ఒక గ్రామా పంచాయితీకి రాష్ట్రస్థాయి అవార్డు రానున్నాదని ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు కోసం ఇప్పటినుంచి తీవ్రంగా కృషి చేస్తామని ప్రత్యేక ప్రణాళికలు సైతం ఏర్పాటు చేసి అధికారులకు, సర్పంచ్లకు వారి బాధ్యత గుర్తు చేస్తూ జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం నిర్మూలన, ఆరోగ్యకరమైన, పిల్లల స్నేహ పూర్వక, మహిళా స్నేహ పూర్వక,క్లీన్ అండ్ గ్రీన్, సుపరిపాలన, నీటి సమృద్ది, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత వంటి తొమ్మిది అంశాలలో ఎంపిక చేసిన గ్రామపంచాయితీలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గ్రామ సర్పంచులకు కార్యదర్శులకు షీల్డ్, శాలువాతో సత్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana