హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ  కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ

Mulugu: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ  కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ

govt jobs in umadi warangal dists

govt jobs in umadi warangal dists

ఉమ్మడి వరంగల్ జిల్లా పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిధి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతున్నారు.

( M Venu, News 18, Mulugu)

ఉమ్మడి వరంగల్ జిల్లా పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిధి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు ఎటునాగారం పరకాల కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు అతిధి ఆధ్యాపకుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

జిల్లాలో ఖాళీలు ఎక్కడ: హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాలో ఇంగ్లీష్ -4, బిజినెస్ అనలిస్ట్ -4, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - 2, మైక్రో బయాలజీ -1, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ -4 ఖాళీలు ఉన్నాయి. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ -1, కంప్యూటర్ సైన్స్ - 1 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8179132191 ఏటూర్ నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ -1, తెలుగు -1 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9989322108

పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ -1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-1, డైరీ సైన్స్ -1, మ్యాథమెటిక్స్ -1 సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని సంబంధిత కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ దరఖాస్తులు కోరుతున్నారు.


అర్హతలు: అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులలో జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. SET, NET, PhD ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana, Warangal

ఉత్తమ కథలు