హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS News: ఆ జిల్లాలో రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భూమిపై హక్కు పత్రాలు

TS News: ఆ జిల్లాలో రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భూమిపై హక్కు పత్రాలు

ములుగు జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

ములుగు జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

Mulugu: తుది దశకు చేరుకున్న పౌరు భూముల సర్వే త్వరలోనే ఆ జిల్లా రైతులకు హక్కు పత్రాలు అందజేయనున్నారు అధికారులు. గ్రామ సభలు నిర్వహించి సందేహాలు నివృత్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Andhra Pradesh

Venu, News18, Mulugu

తుది దశకు చేరుకున్న పౌరు భూముల సర్వే త్వరలోనే ఆ జిల్లా రైతులకు హక్కు పత్రాలు అందజేయనున్నారు అధికారులు. గ్రామ సభలు నిర్వహించి సందేహాలు నివృత్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా (Mulugu District) వ్యాప్తంగా అనేక మంది గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రంలో ఉన్న గిరిజన రైతులకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా వ్యాప్తంగా 9 మండలాలలో అర్హులైన గిరిజనుల పోడు భూముల సర్వేను అధికారులు 95% పూర్తి చేశారు.

అయితే అనేకమంది గిరిజనులకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా ములుగు జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 9 మండలాల పరిధిలో 118 గ్రామపంచాయతీల నుంచి 34 వేల పైచిలుకు పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు అధికారులు 33 వేల పైచిలుకు దరఖాస్తులను పరిశీలించి భూములను సర్వే చేసినట్లు తెలుస్తుంది.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

మిగిలిన వెయ్యి దరఖాస్తులను త్వరలోనే సర్వే పూర్తి చేసి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ములుగు జిల్లాలో 20 శాతం అటవీ ప్రాంతం ఉంది. అడవులను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎవరైనా కొత్తగా పోడు వ్యవసాయం కోసం అడవులను నరికి వేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు మంజూరైన పట్టా పాస్ బుక్లను రైతుబంధును నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

పోడు భూములకు హక్కు పత్రాల కోసం రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు ఒక స్పష్టమైన రీతిలో అర్హత ఉన్నవారికి మాత్రమే హక్కు పత్రాలు ఇస్తామని స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో సాటిలైట్ చిత్రాలు కీలకంగా మారనున్నాయి. 2005 కంటే ముందు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తూ ఉన్నారో అర్హులైన అందరికీ హక్కు పత్రాలు మంజూరవుతాయి. జిల్లా వ్యాప్తంగా భూముల సర్వే 95 శాతానికి పైగానే పూర్తి అవ్వడంతో రాబోయే కొద్ది రోజుల్లోనే ములుగు జిల్లా గిరిజన రైతులకు హక్కు పత్రాలను అధికారులు ఇవ్వనున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రైతుల్లో ఆనందం వెల్లివిరుసతోంది.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు