Venu, News18, Mulugu
ఆ ప్రదేశం చూడటానికి ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. పక్కనే జంపన్న వాగు గట్టుపైన చింతచెట్టు, విశాలమైన ప్రదేశం ఉండడంతో అనేకమంది భక్తులు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ములుగు జిల్లా (Mulugu District) లోని జంపన్న వాగు (Jampanna Vagu) పై నిర్మించిన చెక్ డాం చూడటానికి ఈత కొలనులా కనిపిస్తుంది. స్వచ్ఛమైన నీరు చూస్తే ఎవరికి మనసు ఆగుతుంది. వెంటనే అందులో దిగి జలకాలు ఆడటం, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలని భావిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చిన పర్యాటకులు ఎప్పుడు ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్రశాంతమైన ఇలాంటి ప్రదేశాలు కనిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.
ఆ ప్రాంతం మేడారం జాతర (Medaram Jathara) సమీపంలో ఉండే చింతల్ క్రాస్ రోడ్.మేడారం జాతరకు వచ్చే భక్తులు కొందరు సొంత వాహనాల ద్వారా వస్తూ ఉంటారు. వారందరూ ఇదే ప్రాంతం గుండా మేడారం చేరుకుంటారు. అనేకమంది భక్తులు ఇక్కడే సేద తీరుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రదేశం చూడటానికి మనసుకు ఆహ్లాదాన్ని కల్పించే పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. జంపన్న వాగు, దానిపై నిర్మించిన చెక్ డాం, వాటర్ స్టోరేజ్ ఉండటంతో స్విమ్మింగ్ పూల్ లా కనిపిస్తుంది. వెంటనే అనేకమంది భక్తులు కూడా ఇక్కడ స్థానాలు చేయడం, వంటలు వండుకొని సేద తీరడం చేస్తూ ఉంటారు. మహా జాతర సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని కూడా పెడుతూ ఉంటారు. కానీ ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి మేడారం మినీ జాతరను అధికారులు నిర్వహిస్తున్నారు.
మేడారం మినీ జాతరకు సైతం లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అధికారులు కనీసం సూచన బోర్డులు కూడా పెట్టకపోవడం బాధాకరం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలి అనే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలి. కానీ ఇలా ప్రమాదకర ప్రదేశాలలో సూచన బోర్డులు పెట్టకపోవడంతో అనేకమంది భక్తులు వాటర్ లో దిగి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. జాతరకు కేవలం నాలుగు రోజుల సమయమే ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇక్కడ సూచన బోర్డులను ఏర్పాటు చేసి ఈతగాళ్లను కూడా నియమించాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Medaram jatara, Mulugu, Telangana