Venu, News18, Mulugu
ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ కనబడుతుంది. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. సొంత జిల్లాలో ఉంటూ ఉద్యోగాలు చేయాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. సొంత జిల్లాలలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయంటే చాలు నిరుద్యోగులు పోటీపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ములుగు జిల్లా (Mulugu District) లోని నిరుద్యోగులకు శుభవార్త వచ్చింది. జిల్లా పరిధిలో ఉండే నిరుద్యోగ అభ్యర్థులలో వైద్య విద్య పూర్తి చేసి మంచి అవకాశం కోసం ఎదురుచూసేవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వైద్య విద్య పూర్తి చేయడంతో పాటు జిల్లాలో ఉంటూ సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో కీలకపాత్ర పోషించవచ్చు.
ములుగు జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులలో వైద్య విద్య పూర్తి చేసిన వారికి ఇదే సువర్ణ అవకాశం. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూర్ నాగారం పరిధిలోని ఏజెన్సీ ఏరియా గిరిజన ప్రాంతాలలో ఖాళీగా ఉన్న వైద్య అధికారి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఏటూరు నాగారం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలలో జాతీయ ఆరోగ్య మిషన్ నందు మాతా శిశు ఆరోగ్య విభాగంలో మొత్తం మూడు వైద్య అధికారి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఐటీడీఏ ఏటూరు నాగారం కార్యాలయం వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు మల్టీ జోన్ వన్ (కాళేశ్వరం జోన్, బాసర జోన్, రామన్న జోన్, భద్రాద్రి జోన్) కు చెందినవారై ఉండాలి. వైద్య అధికారి ఉద్యోగానికి ఎంబీబీఎస్ పట్టబదులై ఉండాలి. అలాగే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు 44 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ జిరాక్స్ సర్టిఫికెట్స్ తో దరఖాస్తు జతపరిచి ఈనెల 25వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు ఐటిడిఏ ఏటూర్ నాగారం కార్యాలయంలోని జిల్లా ఉపవైద్య అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ములుగు జిల్లా ప్రాంతంలోని నిరుద్యోగులు వైద్య విద్య అర్హత కలిగి ఉండి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో ఉన్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana, Ts jobs