హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amma kosam: గర్భిణుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. వివరాలివే

Amma kosam: గర్భిణుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. వివరాలివే

ములుగు

ములుగు

గర్భిణీల కోసం "అమ్మ కోసం" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. గిరిజన గ్రామాల్లో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. గర్భస్థ స్త్రీలలో రక్తహీనత అరికట్టేందుకు 'అమ్మ కోసం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  గర్భిణీల (Pregnant) కోసం "అమ్మ కోసం (Amma kosam)" అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). గిరిజన గ్రామాల్లో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో (Children) పౌష్టిక ఆహార లోపం తరచుగా కనబడుతూ ఉంటుంది.. పౌష్టిక ఆహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యం చూసుకోవడం కోసం ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల  (Anganwadi Centers) ద్వారా వారికి సేవలను అందించడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందే గర్భధారణ జరిగిన స్త్రీలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ములుగు (Mulugu) జిల్లా వైద్య అధికారి 'అమ్మ కోసం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

  అమరన్ సంస్థ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం"అమ్మ కోసం " సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ములుగు జిల్లాలోని ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణీలు ఎంతమంది ఉన్నారు? ఎటువంటి పౌష్టికాహారం అందించాలి? రక్తహీనత సమస్యను ఎలా అరికట్టవచ్చు? గర్భిణీ స్త్రీలకు ఇచ్చే చికిత్స ఏవిధంగా ఉండాలి? అనే తదితర అంశాలలో ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు.

  ముఖ్యంగా గర్భిణీల్లో రక్తహీనత సమస్య అధిగమించేందుకు ఎలాంటి వైద్యం అందించాలో కూలంకషంగా వివరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కువ ప్రమాద స్థాయిలో ఉన్న గర్భిణీ స్త్రీలను వెంటనే ప్రసవం కోసం సరైన సమయంలో వైద్యం అందించేందుకు పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచిస్తున్నారు.

  ములుగు జిల్లాలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదైన రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల వివరాల గురించి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణిలలో ప్రమాద స్థాయి రక్తహీనత జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమంగా ఇచ్చే చికిత్స గురించి శిక్షణ ఇచ్చారు. గర్భిణీల పట్ల ఏఎన్ఎంలు (ANM) చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, మన సేవలను చూసే సాధారణ ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వస్తుంటారని... వారికి మెరుగైన సేవలు మెరుగైన వైద్యం అందించే విధంగా పనిచేయాలని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

  సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి: ఈ మధ్యకాలంలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎడా పెడా ఆపరేషన్లు చేస్తూ ప్రసవాలు చేస్తున్నారు. ప్రసవాలు చేయించుకునేందుకు మంచి ముహూర్తాల కోసం చూస్తూ ఆపరేషన్ ద్వారా ప్రసవాలు చేయించుకుంటున్నారు. అయితే ఈధోరణిలో మార్పు తెచ్చేలా ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు చేయడానికి వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. సత్ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mulugu, Pregnant

  ఉత్తమ కథలు