హోమ్ /వార్తలు /తెలంగాణ /

న్యూస్18 కథనానికి స్పందన.. జంపన్న వాగు వద్ద ఇకపై నో డేంజర్

న్యూస్18 కథనానికి స్పందన.. జంపన్న వాగు వద్ద ఇకపై నో డేంజర్

X
medaram

medaram way

తెలంగాణ (Telangana) కుంభమేళాగా అభివర్ణించుకునే మేడారం మినీ జాతర (Medaram Mini Jathara) అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. గిరిజన పూజారులు అత్యంత భక్తి శ్రద్దలతో వారి సంప్రదాయ పద్ధతులలో మేడారం మినీ జాతరను ప్రారంభించడం జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

తెలంగాణ (Telangana) కుంభమేళాగా అభివర్ణించుకునే మేడారం మినీ జాతర (Medaram Mini Jathara) అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. గిరిజన పూజారులు అత్యంత భక్తి శ్రద్దలతో వారి సంప్రదాయ పద్ధతులలో మేడారం మినీ జాతరను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేడారం జాతర సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేసింది. కానీ మేడారం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో మెరుగైన సౌకర్యాలు భక్తులకు అందడం లేదు. ముఖ్యంగా మేడారం మహా జాతరకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. హనుమకొండ వరంగల్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి సొంత వాహనాల ద్వారా మేడారం రావాలనుకునే భక్తులు ఎక్కువగా నార్లాపూర్ సమీపంలోని చింతల్ క్రాస్ రోడ్ గుండా ఏలుబాక పడిగాపూర్ మీదుగా మేడారం చేరుకుంటారు.

చింతల్ క్రాస్ రోడ్ సమీపంలో చాలా సువిశాల ప్రదేశం ఉంటుంది. చూడటానికి పర్యాటక ప్రాంతంగా భక్తులను ఆకట్టుకుంటుంది. చింతల్ క్రాస్ రోడ్ గుండా జంపన్న వాగు ప్రవహిస్తుంటుంది. అధికారులు జంపన్న వాగుపై నీటిని నిలువ చేయడం కోసం కల్వర్టును నిర్మించారు. కానీ మేడారం జాతర సమయంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను పెట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో వెంటనే న్యూస్ 18 బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వెంటనే న్యూస్ 18 ప్రత్యేక కథనానికి ములుగు జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. వెంటనే లోతట్టు ప్రాంతాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు జంపన్న వాగు సమీపంలో గజ ఈతగాలను సైతం అందుబాటులో ఉంచారు. వీరికి కావాల్సిన సదుపాయాలను కూడా సిద్ధం చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు.

ఇది చదవండి: దేవుడైనా.. మనిషైనా.. ఇతని చేతిలో పడితే సజీవ శిల్పమే

ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతితో న్యూస్ 18 ప్రతినిధి సంభాషించడం జరిగింది. మేడారం జాతర సమయంలో మొత్తం 2 ప్రదేశాలను ప్రమాదకర ప్రదేశాలుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడడానికి మత్స్యశాఖ ఆధ్వర్యంలో 30 మంది గజ ఈతగాలను సిద్ధం చేశారు. వారికి సంబంధించి లైఫ్ జాకెట్లు టీషర్ట్స్, క్యాప్స్, విజిల్స్వారికి జంపన్న వాగు సమీపంలో అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా మత్స్యశాఖ అధికారి న్యూస్ న్యూస్ 18 తో చెప్పారు.

న్యూస్ 18 కథనాన్ని ప్రచురించడంతో అనేకమంది భక్తులు ఇక్కడ ఆగినప్పటికీ నీటిలో దిగి ఆడుకోవడంలో జాగ్రత్తలు వహిస్తున్నారు. చూడటానికి స్విమ్మింగ్ పూల్ లా చాలా విశాలమైన ప్రదేశం కాబట్టి అనేకమంది భక్తులు ఇక్కడే ఆగి సేద తీరుతూ భోజనాలు చేస్తూ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపాలనుకునే విధంగా ఈ ప్రాంతం అనువైనదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిర్లక్ష్యం వహించడంతో న్యూస్ భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం కోసంప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జిల్లా మత్స్యశాఖ అధికారి స్పందించి వెంటనే తగిన ఏర్పాట్లు చేయడంతో ఇక్కడున్న స్థానికులు న్యూస్ 18కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు