రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : చింతల్ క్రాస్ రోడ్
తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర కు సంబంధించి చిన్న జాతర నీటితో ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా ఆదివాసి గిరిజన పూజారులు మేడారం మినీ జాతరను ప్రారంభించారు. ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వన దేవతలను సందర్శించడం కోసం అనేకమంది భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు.
మేడారం చేరుకునే భక్తుల కోసం ప్రభుత్వం అధికారులు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కానీ మేడారానికి చేరుకునే రహదారుల విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. హనుమకొండ హైదరాబాద్ లాంటి నగరాల నుంచి మేడారం చేరుకునే భక్తులు షార్ట్ కట్ రహదారిగా నార్లాపూర్ గ్రామానికి సమీపంలోని క్రాస్ రోడ్ గుండా మేడారానికి చేరుకుంటారు.
కానీ గతంలో కురిసిన వర్షాలకు ఈ రహదారి పూర్తిగా దెబ్బతింది కొన్ని ప్రదేశాలలో రహదారి మధ్యలోనే భారీ గుంతలు సైతం ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే చింత రహదారి పరిస్థితి బాగాలేదు అని న్యూస్ 18 ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
దీంతో అధికారులు కంటి తలుపు చర్యల కింద పనులు నిర్వహించారు.
లక్షల రూపాయలు వెచ్చించి వేసిన రహదారులు కేవలం వర్షాలకు దెబ్బతిన్న పరిస్థితి మరి అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆ రహదారిని కేవలం రోడ్డు సైడ్ మట్టితో కేవలం దుబ్బ మట్టితో గుంతలను పూడ్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.
మొక్కుబడికి చేస్తున్నట్టు తూతూ మంత్రంగా రహదారుల నిర్వహణ మేడారంలో కనిపిస్తుంది. ఈరోజు ఆ రహదారి గుండానే ప్రభుత్వ అధికారులు మంత్రివర్యులు సైతం ప్రయాణించారు. అధికారులు గుత్తేదారులు పనులు నిర్వహిస్తే శాశ్వత ప్రాతిపదిక ఎందుకు ఆలోచించడం లేదని ఇవాళ వేసిన రహదారులు రేపే ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి నేపథ్యంలో మేడారం జాతరకు నిత్య భక్తుల సందర్శన ఉంటుంది కానీ మేడారంలో శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు జరగడం లేదు అని అక్కడ పరిస్థితి మనకు చెప్తుంది.
ఇప్పటికైనా మేడారం జాతర ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. అనేకమంది భక్తులు వనదేవతల సందర్శన కోసం వస్తూ ఉంటారు. జాతర సమయంలో ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనుల నిర్వహణ చేస్తున్నాం అని గొప్పలు చెప్తున్నారు. వారు చేసే ఆర్భాటాలు కేవలం పేపర్లకు ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నాయి .పనుల విషయం వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేయాలని స్థానికులు, భక్తులు కోరుకుంటున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana