హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: 75 సంవత్సరాల పార్లమెంటరీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..

Mulugu: 75 సంవత్సరాల పార్లమెంటరీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..

ఏజెన్సీలో అప్రమత్తమైన అధికారులు

ఏజెన్సీలో అప్రమత్తమైన అధికారులు

Mulugu District: 75 సంవత్సరాల పార్లమెంటు పాలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల....ఏజెన్సీ ఏటూరు నాగారంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో విప్లవ లేఖ కలకలం సృష్టించిందిప్రజా విముక్తి గిరిల సైన్యం

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu,  Mulugu, News18.

75 సంవత్సరాల పార్లమెంటు పాలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల....ఏజెన్సీ ఏటూరు నాగారంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో విప్లవ లేఖ కలకలం సృష్టించింది. ప్రజా విముక్తి  గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు నిండిన సందర్భంగా 22వ వార్షిక వారోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది... డిసెంబర్ రెండవ తారీకు నుంచి ఎనిమిదో తారీకు వరకు వారోత్సవాలను దృఢ సంకల్పంతో ఘనంగా నిర్వహించాలని విప్లవ ప్రజా నిర్మాణాలకు విప్లవ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది....ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టు విడుదల చేసినట్లు తెలుస్తుంది

ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది...విడుదల చేసిన లేఖ సారాంశం ఏమిటి...?ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 2022 డిసెంబర్ 2 నాటికి 22 ఏళ్లు పూర్తి అవుతున్నాయి ఈ సందర్భంగా డిసెంబర్ 2 నుంచి 8 వ తారీకు వరకు 22వ వార్షికోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.... తెలంగాణలో కర్రే గుట్టపై తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు చేసిన దాడిలో అసలు బాసిన అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ జోహార్లను అర్పిస్తుంది... దోపిడీ పాలకవర్గాలకు సిపిఐ మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యం కలగానే మిగిలిపోయిందని విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించడం ఎన్నటికీ సాధ్యం కాదని చారిత్రక సత్యాన్ని ప్రజలు అనేకసార్లు రుజువు చేస్తూనే ఉన్నారని మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు.

నవభారత్ నిర్మాణం పేరుతో బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ రాజ్యాన్ని నిర్మించడానికి బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది అని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు... దోపిడి వర్గాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా ప్రజల సమస్యలను పరిష్కరించలేనంత స్థాయికి దిగజారాయి 75 సంవత్సరాల పార్లమెంటు పాలనలో ప్రజలకు ఒరిగింది లేదని ప్రజల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పాలకులు ప్రజల సమస్యలను పరిష్కరించక పోగా ఫాసిస్టు పాలను కొనసాగిస్తున్నారని లేఖలో మావోయిస్టు పెర్కొన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక దాడి..విచారణ కమిటీ ఏర్పాటు

ఏటూర్ నాగారం ప్రాంతంలో వెలువడిన ఈ లెటర్ ఒక్కసారిగా కలకలం సృష్టించింది ఏజెన్సీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది... తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ బయటికి రావడం దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది ... ఒకవైపు గెరిల్లా సైన్యం ఏర్పడి 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునివ్వడం ఈ వారోత్సవాలను పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకుంటాయో అని హై టెన్షన్ వాతావరణం నెలకొంది

First published:

Tags: Local News, Maoists, Mulugu, Telangana

ఉత్తమ కథలు