హోమ్ /వార్తలు /తెలంగాణ /

బోర్డులు సరే.. సౌకర్యాలేవీ..? మరీ ఇంత నిర్లక్ష్యమా..?

బోర్డులు సరే.. సౌకర్యాలేవీ..? మరీ ఇంత నిర్లక్ష్యమా..?

X
grounds

grounds

Mulugu: క్రీడా ప్రాంగణాల పరిస్థితి చూస్తే ప్రభుత్వం నిధులను నీళ్ల పాలు చేయడమే లక్ష్యంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారేమో అనేలా ఉంది. చిత్ర విచిత్ర సంఘటనలు క్రీడా ప్రాంగణాలను చూస్తే అర్థమవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అనే ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉండే క్రీడాకారులు యువకులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ క్రీడా ప్రాంగణాల నిర్మాణం ఎలా జరిగిందంటే మెడ మీద కత్తి పెట్టి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలి అనే ఒక వైఖరితో అధికారులు ముందుకు వెళ్లారు. పేరుకు మాత్రం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కానీ అందులో ఎన్ని నిజానికి గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులకు అందుబాటులో ఉండి ఉపయోగపడుతున్నాయి..? అంటే కోటికో నూటికో ఒక్కటి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా (Mulugu District) లో క్రీడా ప్రాంగణాలపై న్యూస్18 ప్రత్యేక కథనాన్ని చేపట్టింది.

క్రీడా ప్రాంగణాల పరిస్థితి చూస్తే ప్రభుత్వం నిధులను నీళ్ల పాలు చేయడమే లక్ష్యంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారేమో అనేలా ఉంది. చిత్ర విచిత్ర సంఘటనలు క్రీడా ప్రాంగణాలను చూస్తే అర్థమవుతుంది. ఒకే స్థలంలో రెండు మూడు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన ఘనత మన అధికారులకు దక్కుతుంది. ఎందుకు ఇలా జరిగింది అని ఆరా తీస్తే మాత్రం వారి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే స్థలం లేకపోవడంతోనే ఉన్నదాంట్లోనే రెండు క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసాం అనే సమాధానాలు వస్తున్నాయి.

ఇది చదవండి: ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ప్రతి గ్రామంలోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్

కొంచెం స్థలం కనబడితే చాలు దానికి క్రీడా ప్రాంగణం అని బోర్డు పెట్టేశారు. మరికొన్ని చోట్ల అయితే మరీ విచిత్రం కేవలం బోర్డు మాత్రమే కనిపిస్తుంది.. గ్రౌండ్ కనిపించదు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 ములుగు జిల్లాలోని కొన్ని క్రీడా ప్రాంగణాలు సందర్శించడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగరం ప్రాంతంలోని కొమరం భీమ్ స్టేడియంలో మూడు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన ఘనత మన అధికారులకు దక్కుతుంది. గోవిందరావుపేట మండలంలో అయితే మరీ దారుణం అటవీ ప్రాంతంలోనే కేవలం బోర్డులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు.

ములుగు జిల్లాలో మొత్తం 352 క్రీడా ప్రాంగణాలు మంజూరయ్యాయి. కేవలం క్రీడా ప్రాంగణం అనే బోర్డు పెట్టి బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు అనే ఆరోపణలు సైతం ములుగు జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. క్రీడా ప్రాంగణాలు నిర్మాణాలు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లును రావడంలేదని మరో విధంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ములుగు జిల్లాలో 352 క్రీడా ప్రాంగణాలు ఉంటే వాటిలో ఎన్ని క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగింది.. వాటికి సంబంధించిన మొత్తం నిధులు ఎంత ఇప్పటివరకు ఎన్నిటికి మంజూరు చేశారు అనే మరిన్ని విషయాలు మరో కథనంలో తెలుసుకుందాం.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు