హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్డు .. కాంట్రాక్టర్ల కక్కూర్తితో 10నెలల్లో నాశనం

Mulugu: కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్డు .. కాంట్రాక్టర్ల కక్కూర్తితో 10నెలల్లో నాశనం

MEDARAM ROADS DAMAGE

MEDARAM ROADS DAMAGE

Mulugu: రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత విధంగా కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు అధికారులు రోడ్లపై కుమ్మరించారు. ఫలితంగా జాతర గడిచి పట్టుమని పది నెలలు గడవక ముందే కాంట్రాక్టర్లు వేసిన రోడ్లు ధ్వంసం అయ్యాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly,News18,mulugu)

  తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం(Medaram)జాతరకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టింది. 2022 ఫిబ్రవరి(February)లో జరిగిన జాతరకు ప్రభుత్వం అక్షరాల రూ. 75 కోట్లను కేటాయించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో రూ. 2.5 కోట్లను కేటాయించింది. మొత్తం జాతరలో 21 ప్రభుత్వ శాఖలకు గాను ప్రభుత్వం రూ. 75 కోట్లను కేటాయించింది. ఇందులో ఎక్కువ శాతం నిధులు రోడ్లు(Roads)మరియు భవనాల శాఖ(Buildings Department)కు అందాయి. కానీ రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత విధంగా కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు(Contractors)అధికారులు రోడ్లపై కుమ్మరించారు. ఫలితంగా జాతర గడిచి పట్టుమని పది నెలలు గడవక ముందే కాంట్రాక్టర్లు వేసిన రోడ్లు ధ్వంసం అయ్యాయి. అదే సమయంలో ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

  Sad news: కళ్ల ముందే తల్లి చావు .. తలకొరివి పెట్టిన రుణం తీర్చుకున్న పదేళ్ల కూతురు

  పనుల్లో నాణ్యత శూన్యం..

  ఎలాంటి టెక్నాలజీ, భారీ యంత్ర పరికరాలు లేని సమయంలో కట్టిన నిర్మాణాలు వందల సంవత్సరాలు దాటినా చెక్కు చెదరడంలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ యంత్ర పరికరాలతో వేసిన రోడ్లు పట్టుమని పది రోజులు కూడా నిలవడంలేదు. దానికి ఉదాహరణగా మేడారం జాతరకు అధికారులు వేసిన రోడ్లని చెప్పవచ్చు. జులై నెల నుంచి ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి పలు ప్రాంతాల్లో రహదారులు కోతకు గురయ్యాయి. ఇందులో కొంత మేర ప్రకృతి వినాసనంగా భావించినా, అన్ని చోట్లా పరిస్థితి ఇలా లేదు. మొన్న మొన్న వేసిన రహదారులు సైతం చినుకు తడికే గులక తేలాయి. తారు రోడ్డు సైతం బీటలు వారి, వాహనదారులు ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీల కారణంగా రోడ్లు నాశనం అవుతున్నట్లు తెలుస్తుంది. వర్షాలకు బాగా నానిపోయిన రహదారిపై ఓవర్ లోడ్ వాహనాలు వెళ్లడంతో రోడ్డు గుల్లగుల్లాగా తయారైంది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా..గుత్తేదారులు పైపై మెరుగులు దిద్ది వదిలేయడంతో రోడ్ల దుస్థితి ఇలా తయారయిందని స్థానికులు అంటున్నారు.

  అధ్వాన్నస్థితిలో ఏజెన్సీ రోడ్లు..

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ 2021 అక్టోబర్ 26న ఉత్తర్వులను జారీ చేసింది. జాతరకు 90 రోజుల వ్యవధిలోనే 21 శాఖలు ఈ రూ. 75 కోట్లను ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. తక్కువ సమయంలో అభివృద్ధి పనులు చేయడంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టుమని పది నెలలు కూడా తిరక్కుండా రోడ్లు గుల్లబారిపోయాయి. దీంతో ఇటుగా వచ్చే స్థానికులు, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu, Telangana News

  ఉత్తమ కథలు