(Venu Medipelly, News18, mulugu)
ఆదివాసి మహిళలకు వారి ఆరోగ్యం పై ఎందుకు అంత నిర్లక్ష్యం.....వారి ఆరోగ్యం విషయంలో వారి నిర్లక్ష్యమే వారి ప్రాణాల మీదకు తీసుకువస్తుందా... వారికి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారా...
గర్భం దాల్చిన మహిళలకు ఎన్నో రకాల సదుపాయాలను ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ గిరిజన మహిళలకు కష్టాలు ఎందుకు తీరడం లేదు....అడవిలో జీవనం కొనసాగించడమే వారి తప్పిదమా....ఇంటి వద్ద ప్రసవించిన గిరిజన మహిళ శిశువు మరణించిన ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది...
కొన్ని రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని చింతలపాడు అనే గిరిజన గుంపు ఉంది.ఆ గుంపులో సోమక్క అనే మహిళ నెలలు నిండిన గర్భవతి. అయితే ఆమెకు పురిటినొప్పులు రావటంతో మరికొంత గిరిజనులు... ఇంటి వద్ద ప్రసూతి చేశారు. ఫలితం అప్పుడే జన్మించిన శిశువు మరణించింది.
వెంటనే ఆ మహిళను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటన గురించి తెలుసుకున్న ములుగు జిల్లా వైద్య అధికారి ఆలయం అప్పయ్య దగ్గరుండి ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేశారు... మెరుగైన చికిత్సను సైతం అందించారు ఇది ఇటీవల జరిగిన సంఘటన..
.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గర్భిణీ స్త్రీలకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. న్యూట్రిషన్ కిట్స్ సైతం అందిస్తుంది. ఇవే కాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక సదుపాయాలను సైతం మహిళలకు అందుబాటులో ఉంచింది. మరి ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ గిరిజన మహిళలకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. వారు అడవిలో జీవించడమే వారు చేసిన పాపమా లేక వారికి అవగాహన లోపమా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.
లక్షల బడ్జెట్ను కేటాయించి ప్రభుత్వం పథకాలను సైతం అమలుపరుస్తున్నప్పటికీ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో గుంపులుగా ఏర్పడి వీరి జీవనం కొనసాగుతుంటుంది. వీరి ప్రాంతాలకు అంగన్వాడి టీచర్లు వైద్యులు సంబంధిత అధికారులు నడుచుకుంటూ వెళ్లి అవగాహన కల్పించినప్పటికీ గిరిజన మహిళలు ఆస్పత్రులకు రావాలంటే ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదు. ప్రయాసలకు కూడి గిరిజన మహిళ ఆసుపత్రికి వస్తే వారికి సరియైన వైద్యం అందించడంలో ప్రభుత్వం వైద్యులు విఫలం అవుతున్నారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి... వేరే రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని బతుకు జీవుడా అంటూ వచ్చి జీవం కొనసాగిస్తున్న ఆదివాసీలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana