Home /News /telangana /

MULUGU NEARLY TWO YEARS AFTER DEADLY ENCOUNTER POLICE AND MAOISTS CAME FACE TO FACE IN MULUGU AGENCY MMV PRV BRV

Mulugu: మన్యం పరిధిలో హై టెన్షన్: భద్రాద్రి కొత్తగూడెం - ములుగు సరిహద్దుల్లో ఎన్​కౌంటర్ ​?

ములుగు

ములుగు

దామెరతోగు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, దాదాపు రెండేళ్ల అనంతరం మన్యంలో మళ్ళీ అలజడి రేగడం గుబులు రేపుతోంది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలం వీరాపురం అడవుల్లో, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradr Kothagudem) జిల్లా దామెరతోగు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు (Maoists) మధ్య ఎదురు కాల్పులు (Firing) జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, దాదాపు రెండేళ్ల అనంతరం మన్యంలో మళ్ళీ అలజడి రేగడం గుబులు రేపుతోంది.

    వీరపురం - దామెరతోగు అటవీ ప్రాంతం.. ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఉండే వీరాపురం అటవీ (Veraapuram Forest) ప్రాంతం చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలలోనే మావోయిస్టులు ఆశ్రయం పొందుతారు. అయితే గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులు సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ మొదలు పెట్టారని, ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు (Encounter) జరిగినట్లు స్థానికంగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అందుకు బలం చేకూరుస్తూ మావోయిస్టులకు సంబంధించి ఒక అగ్రనేత మరణించాడని.. మావోలకు (Maoists) సంబంధించిన నిత్యవసర సరుకులు, టెంటు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి.



    మరో వాదన: విశ్వసనీయ సమాచారం మేరకు దట్టమైన అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ మరియు గ్రేహౌండ్స్ బలగాల నేతృత్వంలో పోలీసులు కూంబింగ్ (Combing) నిర్వహిస్తున్న సమయంలో అగ్ర నాయకత్వంలో దాదాపు పది మంది మావోయిస్టులు వీరాపురం అటవీ ప్రాంతంలో ఉన్నారని, ఈ నేపథ్యంలో మావోయిస్టులు సెంట్రీ పోలీసులను చూడగానే అలెర్ట్ అయి వెంటనే అక్కడి నుంచి అందరూ తప్పించుకున్నట్టు ఇంకో వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

    Mulugu: వాహనదారులు ఆ జాతీయ రహదారి ఎక్కాలంటేనే భయపడుతున్నారట.. ఎందుకో తెలుసా?

    రాష్ట్ర కమిటీ సభ్యులే టార్గెట్టా?:

    దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో (Mulugu forest Agency area) మావోయిస్టు కదలికలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల కిందట అటవీలో తూటా పేలింది. అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి కదలికలు లేకుండా మన్యం ప్రాంతం చాలా ప్రశాంతంగా కనిపించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగే పరిస్థితి కనిపించింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మహిళారపు అడుగులు అలియాస్ భాస్కర్ (Bhaskar) కోసం ఇప్పటికీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో కూడా ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం వెంకటాపురం వాజేడు ప్రాంతాలలో మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఈ విషయంలో ములుగు జిల్లా పోలీసులు కొందరు అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలోనే జిల్లా మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ ఎన్కౌంటర్ వార్త నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బలగాలతో నిఘా పెంచారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Encounter, Local News, Maoist, Mulugu, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు