Home /News /telangana /

MULUGU NATIONAL HIGHWAY 163 ROAD DAMAGED IN MULUGU DISTRICT MOTORISTS FIND IT DIFFICULT TO TRAVEL HERE MMV PRV BRV

Mulugu: వాహనదారులు ఆ జాతీయ రహదారి ఎక్కాలంటేనే భయపడుతున్నారట.. ఎందుకో తెలుసా?

జాతీయ రహదారి

జాతీయ రహదారి

పేరుకు మాత్రమే జాతీయ రహదారి (National Highway)...చూస్తే రోడ్డు నిండ గుంతలు. ఆ రహదారి (Road) వైపు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు.

  • News18 Telugu
  • Last Updated :
  • warang, India
    (M. Venu, News 18, Mulugu)

    పేరుకు మాత్రమే జాతీయ రహదారి (National Highway)...చూస్తే రోడ్డు నిండా గుంతలు. ఆ రహదారి (Road) వైపు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. జాతీయ రహదారుల నిర్వహణ సరిగ్గా లేకపోతే టోల్ ప్లాజాల వద్ద డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ములుగు (Mulugu) జిల్లాలోని జంగాలపల్లి గట్టమ్మ క్రాస్ వద్ద జాతీయ రహదారి 163 పూర్తిగా మలుపు తిరుగుతూ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. అధికారులు మాత్రం తాత్కాలిక చర్యల్లో భాగంగా కొద్దిపాటి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ ఏం లాభం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

    రోడ్డు టాక్స్ కట్టడంలో ఎలాంటి మినహాయింపు లేదు..

    మరోవైపు ఇక్కడ రహదారి ఇప్పటికే పూర్తిగా దెబ్బతినగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారైంది. అధిక లోడుతో వచ్చే ఇసుక లారీల కారణంగా గతంలోనే గట్టమ్మ క్రాస్ వద్ద రహదారి కుంగిపోయింది. రోజురోజుకు రోడ్డు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రహదారి మర్మతులపై ఇతర వాహనదారులు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. జాతీయ రహదారుల కోసం కోట్లు ఖర్చు పెట్టామని టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ముక్కు పిండి పైసలు వసూలు చేస్తుంది ప్రభుత్వం. వాహనదారులు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు రోడ్డు టాక్స్ కట్టడంలో ఎలాంటి మినహాయింపు లేదు, టోల్ ప్లాజా వసూలులో ఎలాంటి మినహాయింపు లేదు. అన్ని రూల్స్ సామాన్యుడికే వర్తిస్తే రోడ్డు వేసిన కాంట్రాక్టర్లకు మాత్రం ఏ రూల్స్ లేవు. రోడ్డు నిర్మాణంలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించరు. తూతూ మంత్రంగా రోడ్లు వేసి వదిలేస్తారు. దాని ఫలితంగా అమాయకులైన వాహనదారులు ప్రమాదాల భారీల పడుతున్నారు.


    ఎందుకు మౌనం ?

    జంగాలపల్లి గట్టమ్మ క్రాస్ వద్ద మూలమలుపు ప్రమాదకరంగా ఉంటుందని అధికారులందరికీ తెలుసు. అక్కడ జాతీయ రహదారి పరిస్థితి అద్వానంగా ఉందని కూడా తెలుసు. అన్ని తెలిసినా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. జవహర్ నగర్ టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయినా ఏ ఒక్క వాహనదారుడు టోల్ ప్లాజా అధికారులను ప్రశ్నించే పరిస్థితి లేదు.

    Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?

    మేడారం (Medaram) జాతర సమయంలో తూతుమంత్రంగా రోడ్డు వేస్తున్నారు. జాతర నిమిత్తం వచ్చే భక్తుల సౌకర్యార్ధం మౌలిక వసతులు కల్పించేలా వందల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...ఆయా నిధుల వలన జరుగుతున్న పనులను పర్యవేక్షించడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు తమకు తోచినట్టుగా నాసిరకం పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా రహదారి నిర్వహణ అధికారులు లేదా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ జాతీయ రహదారిని పరిశీలించి మరమ్మతులు చేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, National, Road accident, Travel, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు