Home /News /telangana /

MULUGU NATIONAL HIGHWAY 163 IN MULUGU DISTRICT HAS BECOME DANGEROUS DUE TO HEAVY SAND LORRIES SNR MMV BRV

Mulugu: అధిక లోడు ఇసుక లారీలతో దెబ్బతిన్న జాతీయ రహదారి 163 ..ఆ రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులకు దడే

(ప్రమాదకరమైన

(ప్రమాదకరమైన రోడ్డు)

Mulugu: ములుగు జిల్లాను కలుపుతూ హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు వెళ్లే 163 నెంబర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న లారీల కారణంగా సాధారణ వాహనాలు ఈ రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా మారింది. రోడ్లపైకి వాహనాలతో రావాలంటే స్థానికులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
  (Venu Medipelly,News18,mulugu)
  163 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్(Hyderabad) నుంచి భూపాలపట్నం(Bhupalapatnam)వరకు ములుగు(Mulugu) జిల్లా మీదుగా వెళ్తుంది. అధిక బరువుతో వెళుతున్న ఇసుక లారీల కారణంగా ములుగు జిల్లాలోని 163 నెంబర్ జాతీయ రహదారి(National highway 163 ) ధ్వంసం అయింది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాద గంటికలు మోగిస్తుంది
  అసలే వర్షాకాలం, రోడ్ల నిర్వహణపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రోడ్లు సరిగా ఉన్నాయా లేవా?, మరమ్మతులు చేయించాలా? వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి విషయాలపై ఆర్ అండ్ బీ అధికారులు దృష్టి పెట్టాలి. కానీ, కొందరు అధికారుల ఉదాసీనత వలన, రోడ్లు నిర్వహణకు నోచుకోవడం లేదు. అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో..రోడ్లపై గుంతలు ఏర్పడి..మరమ్మతులకు గురవుతున్నాయి. అధిక బరువుతో వెళుతున్న ఇసుక లారీల కారణంగా ములుగు జిల్లాలోని 163 నెంబర్ జాతీయ రహదారి ధ్వంసం అయింది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాద గంటికలు మోగిస్తుంది.

  న్యూస్18 గ్రౌండ్ రిపోర్ట్:
  163 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు ములుగు జిల్లా మీదుగా వెళ్తుంది. నిత్యం వందలాది మంది సమీప గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం వరకు రహదారి చాలా బాగుంది. అయితే ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చింది. ఈక్రమంలో ఇసుక లారీలు 163 నెంబర్ జాతీయ రహదారి గుండా రాకపోకలు ప్రారంభించాయి. అయితే ఒక్కో లారి పరిమితికి మించి ఇసుక రవాణా చేయడంతో జాతీయ రహదారి దెబ్బతినింది. నిరంతరం ఇసుక రవాణా జరగడం తో రోడ్ మొత్తం గాడి పడ్డాయి. రోడ్డు ఒకవైపుకు ఎగుడుదిగుడుగా మారి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ వర్షాకాలంలో ఆ గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడి పైకి పొంగుకొస్తుంది. దీంతో అనేక మంది వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

  ఇది చదవండి: కారులో వెళుతున్న ఇద్దరు యువకులు కాలి బూడిదైపోయారు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా


  పట్టిచుకొని ఆర్టీఓ, ఆర్ అండ్ బీ అధికారులు:
  జాతీయ రహదారి 163 పై ఇసుక లారీ యజమానులు యదేశ్చగా నిబంధనలు ఉల్లంగిస్తున్నా..అధికారులు పట్టించుకోవడంలేదు. ఒకరిద్దరు మినహా, రవాణాశాఖలో మిగతా విభాగాల అధికారులెవరూ లారీలపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో ఒక లారీ డ్రైవర్‌ను న్యూస్18 ప్రతినిధి విచారించగా.., "ఒక లారీకి రూ.10 వేలు వరకు ట్యాక్స్ కడుతున్నాము, ఇంకా అదనంగా టీఎస్ఎండీసీ సంస్థకి రోడ్డు డామేజ్ కింద రూ. 200 కడుతున్నాము. మావంతు డబ్బు మేము చెల్లిస్తున్నామని" చెప్పుకొచ్చాడు. ఇసుక లారీలో అధిక లోడ్ గురించి ప్రశ్నించగా "ఒక 12 టైర్ లారీ (26 టన్నుల ఇసుక)కి గానూ రూ. 10 వేల నుంచి రూ. 11 వేల వరకు డీడీ రూపంలో చెల్లిస్తున్నాము, డీడీ చెల్లింపు అనంతరం లారీలో ఇసుక లోడింగ్ నిమిత్తం టిఎస్ఎండిసి సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, డీడీ డబ్బులు కాకుండా ఒక లారీ లోడ్ చేసినందుకు గానూ రూ. 1200 -1500 మధ్య అదనంగా వసూలు చేస్తున్నారు" అని ఓ లారీ డ్రైవర్ చెప్పుకొచ్చాడు.

  దొరికితే దొంగ.... దొరకకపోతే దొర:
  అదనంగా ఎలాగూ డబ్బులు చెల్లిస్తున్నారు కాబట్టి అదనపు డబ్బులు ఇచ్చి అధిక లోడ్ వేసుకోవడంలో తప్పు ఏముందని లారీ డ్రైవర్లు చెప్పడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి , ఏటూరునాగారం, పస్రా, జంగాలపల్లి ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు చెక్‌పోస్ట్‌లు పెట్టి మరీ చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్‌లో దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే విధంగా ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో ఒక ఆర్టీఓ అధికారి ఏకంగా వందకు పైగా పరిమితికి మించిన ఇసుకను రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు. వందకు పైగా లారీలు పట్టు పడ్డాయంటే ములుగు జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణా ఏస్థాయిలో ఉందొ అర్ధం అవుతుంది. పరిమితికి మించి రోడ్డెక్కే లారీలను, లారీ యజమానులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని అధికారులు చెబుతున్నారు. అధిక లాభాల కోసం ఆశపడి లారీ యజమానులు ఇలా అధిక బరువు వేస్తుండడంతో జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయింది.

  ఇది చదవండి: కొడుకు చేసిన మోసానికి గాయపడ్డ తల్లి మనసు .. ఘోరాన్ని తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం  అధికారులు చర్యలు తీసుకోండి:
  రవాణా అధికారులతో పాటు స్థానిక పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. కాంట్రాక్టర్ల లాభం కోసం సాధారణ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని, దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయించాలని, అధిక లోడుతో వచ్చే ఇసుక లారీలను నిలువరించాలని ములుగు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  ఇది చదవండి: గర్భిణి విషయంలో చేయకూడని తప్పు చేశారు ఆ డాక్టర్లు .. కప్పి పుచ్చుకునే క్రమంలోనే ప్రాణాలు తీశారు


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు