Home /News /telangana /

MULUGU NATIONAL HIGHWAY 163 BECAME DANGEROUS AFTER LOW LEVEL BRIDGE WASHED AWAY DUE TO HEAVY RAINS MMV BRV PRV

Mulugu: యమపురికి ఎంట్రీ పాయింట్‌గా ఆ జాతీయ రహదారి: పట్టించుకునే నాథుడే లేడే !

ములుగు

ములుగు రోడ్లు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో జలగలంచ వాగు ఇటీవల వరదలకు ఉప్పొంగి ప్రవహించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా వాగు ఉధృతంగా ప్రవహించింది. జాతీయ రహదారి గుండా ప్రవహించే ఈ వాగుపై పలు చోట్ల లో లెవెల్ వంతెనలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    163వ నెంబర్ గల జాతీయ రహదారి (National highway) హైదరాబాద్ (Hyderabad) నగరం నుంచి ములుగు (Mulugu) జిల్లా మీదుగా భూపాలపట్నం వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏటూర్ నాగారం అభయారణ్యం గుండా వెళ్లే ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు పచ్చని అటవీ అందాలను ఆస్వాదిస్తూ మంచి అనుభూతిని సొంతం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (heavy rains) జిల్లా వ్యాప్తంగా రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరలా పాటికి మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు తాత్కాలిక పనులు చేసి మమ అనిపించుకుంటున్నారు.

    ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో జలగలంచ వాగు ఇటీవల వరదలకు ఉప్పొంగి ప్రవహించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా వాగు ఉధృతంగా ప్రవహించింది. జాతీయ రహదారి గుండా ప్రవహించే ఈ వాగుపై పలు చోట్ల లో లెవెల్ వంతెనలు ఉన్నాయి. ఈక్రమంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు పై ఉన్న లో లెవెల్ వంతెన రాత్రికి రాత్రే ధ్వంసం అయింది. ఈ వాగుపై నిర్మించిన లో లెవెల్ వంతెనతో పాటు రోడ్డు సైతం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది. దీంతో ఒక్కసారిగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రశాంతంగా ప్రవహించే ఈ వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడం వల్ల సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో స్పందించిన అధికారులు ఈ వంతెనపై తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలను కొనసాగించారు.



    రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం:

    కానీ మళ్లీ కురిసిన వర్షానికి రహదారి (Roads) మొత్తం గుంతల మయం అయింది. ప్రస్తుతం ఈ వాగు వద్ద పరిస్థితి ఎలా ఉందంటే... రెండు రోజుల క్రితం వంతెన దాటేందుకు ప్రయత్నించిన ఓ లారీ అదుపుతప్పి.. వాగులో పడిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ లారీ బదులుగా ఇతర చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టం మాత్రం తప్పదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జలగలంచ వాగు సహా ఏజెన్సీలో ఉన్న వాగులపై హై లెవెల్ వంతెనలను నిర్మించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

    రాత్రిళ్ళు భయం భయంగా ప్రయాణం:

    ఒకప్పుడు ఎంతో సాఫీగా ప్రయాణం కొనసాగించే ఈ రహదారి, ప్రస్తుతం పూర్తిగా ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తుంది. పగటి పూట ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.. ఇక రాత్రిళ్ళు ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానిక వాహనదారులు అంటున్నారు. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితుల్లో, రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు సంబంవించి ప్రాణ నష్టం వాటిల్లకముందే అధికారులు స్పందించి కనీసం గుంతలను పుడ్చేందుకైనా చొరవ చూపాలని... స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, Road accidents

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు