Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu district) సంక్షేమ అధికారి శ్రీమతి ఏఏపీ ప్రేమలత అధ్యక్షతన జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు (National Girl Child Day) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాలికలు సమ్మక్క - సారలమ్మ ప్రతిరూపాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యాన్ని ప్రదర్శిస్తేబాలికలు అన్ని రంగాల్లో రాణించి కన్న తల్లితండ్రులకు, చదువుకున్న పాఠశాల, కళాశాలలకు పేరు తీసుకువస్తారు అని అన్నారు.ఈరోజుల్లోపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించాలంటే ఎదుటివారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతీ బాలికా స్వీయ రక్షణ కళలను నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు తమ చదువులను ఎట్టి పరిస్థితుల్లో నైనా మానివేయకుండా కొనసాగిస్తేనే వారు స్వేచ్చగా, స్వతంత్రతతో సాధికారతను సాధించవచ్చని అన్నారు.
పాఠశాలల్లో బాలికలపై ఏమైనా వేధింపులు ఎదురవుతున్నాయేమో గమనించాలని సంబంధిత అధికారులకు సూచించారు.జిల్లాలో బాలికల సర్వతో ముఖాభివృద్ధికి అన్నివిధాల అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. అంతకుముందు ఈ వేడుకలకు వచ్చిన పిల్లలతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ జాతీయ బాలికా దినోత్సవం గురించి పిల్లల యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా.. వివిధ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల నుండి వచ్చిన బాలికలు కలెక్టర్ తో మాట్లాడుతూ.. తమకు అవకాశాలు కల్పిస్తే మీ నమ్మకాన్ని నిలబెడతామని, అసాధ్యాలను సుసాధ్యం చేస్తామని, బాలికలకు స్వేచ్ఛను ఇచ్చి, వారిపై నమ్మకాన్ని ఉంచితే వారు తప్పకుండా ఉన్నతంగా ఎదుగుతారు అన్నారు. అనంతరం ధైర్యంగా తమ అభిప్రాయాలను వెల్లడించిన చిన్నారులను కలెక్టర్ అభినందించారు.
జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జాతీయ బాలిక దినోత్సవం రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాలికలపై జరుగుతున్నటువంటి వేధింపులు,ఇబ్బందులను అరికట్టడానికి ప్రభుత్వం పని చేస్తూ ములుగు జిల్లా నుండి బాలల పరిరక్షణ కోసం జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ లు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అని బాల్యవివాహాలు అరికట్టడం, బాల కార్మికులను నిషేధించడం, పోక్సో చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయబడుతున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు బాల్యవివాహాల నిరోధక చట్టం కొన్ని కేసులు పెట్టడం జరిగిందని, అలాగే బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై లైంగిక దాడుల నిరోధక చట్టం-పొక్సో క్రింద కేసులు పెట్టడం, బాల కార్మిక నిరోధక చట్టం క్రింద మైనర్ పిల్లలతో పని చేయించుకుంటున్న రైతులు మరియు ఇతర రంగాల యజమాన్యం మీద కేసులు పెట్టడం జరిగింది అని నిత్యం బాలికల కోసం ఈ డిపార్ట్మెంట్ సిబ్బంది విస్తృతంగాకృషి చేస్తూ వారి క్షేమం కోసం 24x7 సేవలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా, విద్యార్థినిలుఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలకు గురికాకుండా తమ తాము రక్షించుకోనే దిశగా ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి అనితెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థునులలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన బాలికలను సుమారుగా 33 మందిని గౌరవ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా మహిళాఅధికారుల చేతుల మీదుగా శాలువలతో ఘనంగా సత్కరించి వారికి బహుమతులను అందించడం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana