హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న గవ్వల డాక్టర్

Mulugu: ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న గవ్వల డాక్టర్

X
డాక్టర్

డాక్టర్ వెరైటీ వైద్యం

Telangana: ఏజెన్సీ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపమేనా.. అనే సందేహానికి ఈ డాక్టర్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. చదివింది పదో తరగతి మాత్రమే కాగా బిల్డప్ మాత్రం బిల్డప్ బాబాయ్ ని మించిపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు

లొకేషన్ : ములుగు

ఏజెన్సీ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపమేనా.. అనే సందేహానికి ఈ డాక్టర్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. చదివింది పదో తరగతి మాత్రమే కాగా బిల్డప్ మాత్రం బిల్డప్ బాబాయ్ ని మించిపోయాడు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. ఇతనికి తెలియని వైద్యం ఏది లేదు.. కేవలం పేరుకు మాత్రమే ఆర్ఎంపి వైద్యుడు కాగా.. హోమియోపతి, హలోపతి నుండి ఏకంగా భూత వైద్యం కూడా చేస్తున్నాడు. సాధారణంగా డాక్టర్ అంటే స్టెతస్కోప్ పెట్టి ప్రజల ఆరోగ్యం పరీక్షిస్తాడు. కానీ ఇతడు మాత్రం దీనికి విరుద్ధంగా మెడలో స్టెతస్కోప్ కనిపించదు.. మరి ఎలా పరీక్షిస్తాడు అనే సందేహం మీకు వస్తుందా..?

వైద్యం కోసం ఇతని వద్దకు వెళ్తే చేతిలో గవ్వలు పెడతాడు.. స్వయంగా గవ్వలు వేపిస్తాడు.. గవ్వలతోనే వైద్యాన్ని నయం చేస్తారట.. ఈ గవ్వల డాక్టర్ బాగోతం మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గవ్వల డాక్టర్ కథనంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి వైద్య అధికారులను తనిఖీకి పంపించారు. తనిఖీలు చేసిన అధికారులు వెంటనే అతని ఆసుపత్రిని సీజ్ చేశారు. ఎవరో ఒకరు బయట పెడితే కానీ వైద్య అధికారులు ఆర్ఎంపీ డాక్టర్లపై తనిఖీలు నిర్వహించరు. ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేయాలి కదా.. మరి ఈ డాక్టర్ ఏకంగా కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నడిపిస్తూ బినామీ పేరుతో మందుల షాపును కూడా నిర్వహిస్తుంటే వైద్య అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఎవరి వాటాలు వారికి అందుతున్నాయని.. ఇంక తనిఖీలు ఎందుకు నిర్వహిస్తారనే మరో చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ప్రాంతంలో శ్యాంసుందర్ అనే వ్యక్తి క్లినిక్ ప్రారంభించాడు.. మెడికల్ షాప్ సైతం నిర్వహిస్తున్నాడు. రెండు చేతులా సంపాదన అయినా డబ్బులు సరిపోలేదు కాబోలు మరో అవతారం ఎత్తారు. గాలి సోకినా.. దయ్యం పట్టినా వదిలిస్తానని ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు. వచ్చినవారికి గవ్వలు వేసి వైద్యం చేస్తున్నారట. గాలి సోకిందని చెప్తున్నాడట.

ఇలా ఇతని వ్యవహారం బయటికి పొక్కడంతో స్పందించిన అధికారులు ఆస్పత్రిని వెంటనే సీజ్ చేశారు. మొదటగా ఆర్ఎంపి డాక్టర్ గా మొదలుపెట్టిన ఇతని ప్రస్థానం.. కొద్దికాలంలోనే కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లాడు. ఇలాంటి ముసుగులో మరెందరో ఆర్ఎంపి వైద్యులు ఆధునిక వైద్యం కూడా అందిస్తున్నారు. దొరికింది మాత్రం ఒక్కరే దొరకాల్సిన వారు ఎందరో. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి ఆర్ఎంపీ వైద్యులను కేవలం ప్రధమ చికిత్సకి పరిమితం చేయవలసిన అవసరం ఉంది.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు