Venu, News18, Mulugu
పోలీసుల చేతిలో లాఠీ ఉంటుంది.. డాక్టర్ల మెడలో స్టెత స్కోప్ ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఆ కాంబినెషన్ మాములుగా ఉండదు. ఇప్పుడాలంటి రేర్ కాంబినేషన్ తెలంగాణలో సెట్ అయింది. ఆయన ములుగు జిల్లా (Mulugu District) పోలీస్ బాస్ కానీ పోలీస్ కాకముందే అతను ఒక మంచి వైద్యుడు కొన్ని సంవత్సరాల పాటు వైద్య రంగంలోనూ సేవలను అందించాడు. అనంతరం సివిల్ సర్వీసెస్ ద్వారా ఇండియన్ పోలీస్ సర్వీసులో తన కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు... అప్పటినుంచి ఏజెన్సీ ప్రాంతాలలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి ఒక కొత్త అర్ధాన్ని తీసుకువచ్చే విధంగా ఎన్నో రూపకల్పనలు చేశాడుఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు వైద్య శిబిరంలో మళ్లీ డాక్టర్‌గా మారి గిరిజన ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నాడు. ఇంతకు అతను ఎవరో అనుకుంటున్నారా....అతనే ములుగు జిల్లా సూపరిడెంట్డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వడమే కాకుండా ఎందరో యంగ్ ఆఫీసర్లకు పూర్తి దయకంగా నిలుస్తున్నాడు.
ములుగు జిల్లా ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలలో ఆదివాసీలు వైద్య సదుపాయం సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో ములుగు సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఆదివాసి గుత్తి కోయ గిరిజన ప్రజలకి సుమారు 500 కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.....మారుమూల గిరిజన గ్రామమైన గోవిందరావుపేట మండలం పసర పిఎస్ఆర్ గార్డెన్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రారంభించారు...ప్రారంభించడమే కాకుండా గిరిజన ప్రజల నాడిని తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రజల కొరకు గోవిందరావుపేట మండలం పిహెచ్సి వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందర్నీ ఒక చోటకు తీసుకొని రావడం చాలా సంతోషకరం ఇలాంటి క్యాంపులు ఇంకా ఎన్నో జరపాలని పై అధికారులను కోరుచున్నాము అని వారు అన్నారు.
ఈ క్యాంప్ నందు అన్నీ రకాల రక్త పరీక్షలు చేయబడును. అదేవిధంగా కంటి పరీక్షలు చేయబడును.అందరికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అవసరమనుకుంటే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చికిత్స చేయబడును. ఈ వైద్య శిబిరంలో 500 మంది155మంది పిల్లలకు సాధారణ పరీక్షలు 110 మందికి కంటి పరీక్షలు మూపై రెండు మందికి రక్త పరీక్షలను చేశారు.
ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు, ముక్కు వైద్య నిపుణులు సాధారణ వైద్య నిపుణులు, వైద్య నిపుణులు మరియు వైద్య సిబ్బంది, ఐ ఎస్ డిఎస్ సిబ్బంది మరియు ఐ టి డి ఏ. వైద్య సిబ్బంది గోవిందారావు పేట మండలం వైద్యాధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు. వెంకటాపూర్ గోవిందరావుపేట ములుగు మండలంలోని 30 గుంపుల గిరిజన ప్రజలకువైద్య పరీక్షలు చేసిన పోలీసు అధికారులకు గిరిజనులు తరఫున ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana