హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఏ సమస్యైనా 3 రోజుల్లోనే పరిష్కారం.. ప్రజావాణిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ

Mulugu: ఏ సమస్యైనా 3 రోజుల్లోనే పరిష్కారం.. ప్రజావాణిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ

X
ప్రజావాణిపై

ప్రజావాణిపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్

Mulugu: ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజావాణి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు (Mulugu) జిల్లా ఏర్పాటు కాకముందు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఉండేది. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి ఎలా తీసుకువెళ్లాలో తెలియక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతుండేవారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఎప్పుడైతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందో ప్రభుత్వ విధి విధానాల అమలు, ప్రజలకు సరైన పాలన అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రతి జిల్లాలో అనేక సమస్యలు సామాన్య ప్రజలకు ఎదురవుతున్నాయి. వీటిని అధికారుల దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వెంటనే సమస్యలు పరిష్కారం చూపించాలని ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Mulugu: మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఉచితంగా కుట్టు మిషన్, శిక్షణ

ఈ కార్యక్రమం ములుగు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నిర్వహిస్తూ ఉంటారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. వెంటనే ఆ సమస్యకు సంబంధించిన అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ప్రజలకు సమస్య వచ్చింది అని తెలిస్తే వెంటనే సంబంధిత శాఖకు జిల్లా కలెక్టర్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.

Warangal: పుస్తకాలు సరే.. సౌకర్యాలెక్కడ..? 60ఏళ్ల నాటి లైబ్రరీపై అంత నిర్లక్ష్యమా..?

దీని ద్వారా ప్రజలకు మూడు రోజులలో ఆ సమస్యపై పూర్తి వివరణ ఇవ్వడంతో పాటు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ములుగు జిల్లా ప్రజలకు ఒక మంచి నమ్మకం ఏర్పడింది. గతంలో దళారీ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ నేడు ప్రజలే స్వయంగా కలెక్టర్ గారికి తమ దృష్టిని తీసుకువెళ్లే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. ములుగు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం 20 నుంచి 30 మంది తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఆ సమస్యలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ములుగు జిల్లాలో ఎక్కువగా పోడు వ్యవసాయంపై అనేక సమస్యలు దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెనువెంటనే సమాధానమిస్తూ పనులు కూడా చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు