Home /News /telangana /

MULUGU MULUGU SENIOR OFFICER INSTRUCTIONS FOR CANDIDATES PREPARING FOR TELANGANA GROUP JOBS SNR MMV BRV

Group Exams: గ్రూప్-1 ఉద్యోగాలకు తీవ్ర పోటీ, అభ్యర్థులు ఎలా సిద్దం కావాలి: రిటైర్డ్ అధికారి సూచనలు

(గ్రూప్‌-1

(గ్రూప్‌-1 జాబ్‌ కొట్టాలంటే..)

మొత్తం 3.8 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఈ గణాంకాలు చూస్తే ఒక్క పోస్టుకు 755 మంది వరకు పోటీపడుతున్నారు. ఈ విధంగా చూస్తే గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంత పోటీ ఉందో అర్థమవుతుంది

    (Venu Medipelly,News18,mulugu)
    గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి పెద్ద సంఖ్యలో గ్రూప్ - 1 (Group - 1 jobs) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. చాలా రోజుల తరువాతా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3.8 లక్షలదరఖాస్తులు (3.8 Lakh job applications) వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఈ గణాంకాలు చూస్తే ఒక్క పోస్టుకు 755 మంది వరకు పోటీపడుతున్నారు. ఈ విధంగా చూస్తే గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంత పోటీ (Competitive Exams) ఉందో అర్థమవుతుంది. ఈ తీవ్ర పోటీని తట్టుకుని అభ్యర్థులు ఎలా విజయం సాధించాలి? ఏ సబ్జెక్టు మీద గ్రిప్ సాధించాలి? మహిళలు ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి? (Exam Preparation) అనే అంశాలపై సీనియర్ అధికారి భూక్య దేవ్ సింగ్ నాయక్ (Municipal Commissioner -VRS) \"న్యూస్ 18\" ద్వారా అభ్యర్థులకు కొన్ని సలహాలు సూచనలు చేశారు.

    AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక‌.. అర్హ‌త‌ల వివ‌రాలు

    అభ్యర్థులకు ఇంటర్వ్యూ రద్దు: తెలంగాణ (Telangana) ప్రభుత్వం మొదటిసారిగా గ్రూప్ డి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గ్రూప్ ఉద్యోగాలకు గతంలో ఇంటర్వ్యూ విధానం ఉండేది. ప్రస్తుతం ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది (No face to face Interview). దీని ద్వారా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.



    మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు: అన్ని రంగాలలో మహిళలు అసాధారణ ప్రతిభను చూపిస్తున్నారు. తమదైన ముద్రవేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మహిళల నుంచి ఎక్కువ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గృహిణిలు కూడా గ్రూప్ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు (Women applicants).

    ఇది చదవండి: ప్రశాంతంగా ముగిసిన టెట్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?


    ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే భయం పోవాలి: గ్రూప్ 1 పరీక్షా విధానంలో మ్యాథమెటిక్స్‌తో పాటు రీజనింగ్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థులు మ్యాథ్స్ కోసం ఉన్న ఆ సమయాన్ని ఇతర సబ్జెక్టులు చదివి ఎక్కువ స్కోర్ సాధించేలా చూడాలి. దీంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే కాస్త భయం ఉంటుంది. ఈ పరీక్షా విధానంలో ఇంగ్లీష్ (English) సబ్జెక్టులకు కేవలం 35 మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ మార్క్స్ మెరిట్ మార్కులలో ప్రాధాన్యం లేదు కాబట్టి కేవలం క్వాలిఫై పేపర్ గానే పరిగణించబడుతుంది.

    TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్‌మెన్ పోస్టుల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. స్కోరింగ్ టాపిక్స్ తెలుసుకోండి

    తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి గురించి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఉద్యమ చరిత్ర నుంచి తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో జరిగే జాతరలు వివిధ పండుగలు, సంస్కృతులకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ సబ్జెక్టులను స్కోరింగ్ సబ్జెక్ట్ గా పరిగణించాలి.

    ఇది చదవండి: తెలంగాణ ఇంటర్, పదోతరగతి ఫలితాలపై స్పష్టత.. విడుదల తేదీలు ఇవే!


    నామ మాత్రపు ప్రిపరేషన్ వద్దు: చాలా మంది అభ్యర్థులు నామమాత్రంగా చదివి ఓ పనైపోయింది అనే విధంగా పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. అలా చేయడం వల్ల సమయం వృధా కావడం తప్ప పరీక్షలో ఫలితం ఉండదు. అందరూ ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదివితే విజయం సాధించవచ్చు.

    JNTUH: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జేఎన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

    ములుగు జిల్లాకు చెందిన రిటైర్డ్ మునిసిపల్ అధికారి (VRS) భూక్య దేవ్ సింగ్, ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆయన నుంచి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఫోన్ నెంబర్ 79819 49164 కు ప్రయత్నించవచ్చు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Group 1, Local News, Mulugu, Telangana jobs

    తదుపరి వార్తలు