హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: గ్రామీణ అభివృద్ధి సంస్థలో రూ.3 కోట్ల కుంభకోణం.. నిజా నిజాలేంటి?

Mulugu: గ్రామీణ అభివృద్ధి సంస్థలో రూ.3 కోట్ల కుంభకోణం.. నిజా నిజాలేంటి?

X
డీఆర్డీఏలో

డీఆర్డీఏలో రూ.3 కోట్ల కుంభకోణం..ఇందులో నిజాలేంటి?

Mulugu: అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే ఇలాంటి చర్యకైనా సిద్ధమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి చెప్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూపాయి ఖర్చు చేయాలన్న దానికి ఒక విధానం ఉంటుందని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే ఎవరు చూస్తూ ఊరుకోరని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ములుగు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే వార్తలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ములుగు జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం, వాటిపై నిజ నిజాలను తెలుసుకునే ప్రయత్నం న్యూస్ 18 చేసింది.

అసలు ఏం జరిగింది...?

తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి పండించిన ధాన్యాన్ని సేకరించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామాలలోని గ్రామ సమైక్య సంఘాలకు అప్పజెప్పింది. ఈ గ్రామ సమైక్య సంఘాలలో మహిళలు మూడు సంవత్సరాల నుంచి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన కమిషన్ డబ్బులు మూడు సంవత్సరాల నుంచి మహిళలకు అందడం లేదనేది వాదన. ఈ నేపథ్యంలోనే మహిళలు అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరి అయిన సమాధానం రాలేదనేది మరో వాదన. మూడు సంవత్సరాల నుంచి కమిషన్ డబ్బులు పడకపోవడంతో 200కు పైగా జిల్లా వ్యాప్తంగా పనిచేసిన గ్రామ సమైక్య సంఘాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కమిషన్ డబ్బులు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో జమ అయినప్పటికీ వాటిపై వచ్చే వడ్డీ డబ్బుల కోసం అధికారులు ఆశపడ్డారని ఇంకొందరు గుసగుసలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి నాగ పద్మజతో మాట్లాడడం జరిగింది.

కుంభకోణంలో మీ వాటా ఎంత అని ప్రశ్నించగా అధికారి కీలక వివరాలు చెప్పారు.       '' నేను 2021 ఏప్రిల్ నెల నుంచి విధుల్లో ఉన్నా .2021 జూన్ నుంచి 2021 ఆగస్టు వరకు మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలను వాటికి సంబంధించిన ఖాతాలలో జమ చేశాం. అధికారులకు సంబంధించిన క్యాష్ బుక్ ప్రకారం 15 లక్షల రూపాయలు సంబంధిత ఖాతాలో జమ  అయ్యాయి. వివిధ కారణాల వల్ల జిల్లా కలెక్టర్ గారి అనుమతితో నాలుగు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి2012 కమిషన్ డబ్బులు జమ అవడం జరిగింది. ఇప్పటివరకు 2012 నుంచి 2019 ఖరీఫ్ వరకు 9 ట్రాన్సాక్షన్స్ నా ఆధ్వర్యంలో జరిగాయి. కమిషన్ రూపంలో వచ్చిన రూపాయిలో 25 పైసలు వివో వేజెస్, 65 పైసలు శ్రీనిధి డిపాజిట్లు, 10 పైసలు జిల్లా సమాఖ్య వారికి జమచేస్తాం. ఇప్పటివరకు వచ్చిన కమిషన్ డబ్బులను అన్ని గ్రామ సమైక్య సంఘాలకు జమ చేశామరని.. కొన్ని కారణాలవల్ల జాప్యం జరిగినప్పటికీ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు.

అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే ఇలాంటి చర్యకైనా సిద్ధమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి చెప్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూపాయి ఖర్చు చేయాలన్న దానికి ఒక విధానం ఉంటుందని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే ఎవరు చూస్తూ ఊరుకోరని తెలిపారు. నిరాధారమైన వార్తలు రాయడం కావాలని సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సదరు అధికారి  స్పష్టం చేశారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు