హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: చూపులతో కైపెక్కిస్తారు.. సైగ చేసి పక్కకు రమ్మంటారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

Mulugu: చూపులతో కైపెక్కిస్తారు.. సైగ చేసి పక్కకు రమ్మంటారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

వివరాలు తెలియజేస్తున్న అధికారులు

వివరాలు తెలియజేస్తున్న అధికారులు

Telangana: వారికి బస్టాండ్లు రద్దీగా ఉండే ప్రాంతాలే అడ్డ.. చూపులతో గాలమేస్తారు.. చూపులతో కైపెక్కిస్తారు.. వయ్యారాలతో ఆకర్షిస్తారు.. తరువాత పక్కకు రా అని సైగలు చేస్తారు. యువకులే వారి టార్గెట్.. వారి చూపులకు సైగలకు ఆశపడ్డారో అంతే సంగతులు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు

లొకేషన్ : ములుగు

వారికి బస్టాండ్లు రద్దీగా ఉండే ప్రాంతాలే అడ్డ.. చూపులతో గాలమేస్తారు.. చూపులతో కైపెక్కిస్తారు.. వయ్యారాలతో ఆకర్షిస్తారు.. తరువాత పక్కకు రా అని సైగలు చేస్తారు. యువకులే వారి టార్గెట్.. వారి చూపులకు సైగలకు ఆశపడ్డారో అంతే సంగతులు.. సర్వం సమర్పయామి. వ్యభిచారం ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ డీసీపీ వెంకటలక్ష్మి వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్వతగిరి గ్రామానికి చెందిన రాయపురం సరిత, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొండం స్వరూప, నూనె స్వప్న, వరంగల్ జిల్లా కొత్తూరుకు చెందిన విజయ్ కుమార్ నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు.

గ్యాంగ్ లో ఉన్న ముగ్గురు మహిళలు బస్ స్టేషన్లలో మకాం వేసి యువకులను, అమాయకులను ప్రలోభ పెట్టేవారు. వీరు ప్రత్యేక వాహనం అద్దెకు తీసుకుని.. ఆకర్షించిన అమాయక యువకులను ఆ వాహనంలో ఎక్కించుకొని నిర్మానుష ప్రదేశాలకు తీసుకు వెళ్లేవారు. అక్కడకి వెళ్లడమే ఆలస్యం గ్యాంగ్ లో మరో సభ్యుడైన విజయ్ కుమార్ కు సమాచారం అందించేవారు.

వెంటనే విజయ్ కుమార్ అక్కడికి చేరుకొని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఈ గ్యాంగ్ పై ఇప్పటికీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 20 వేల నగదు, రెండు ఫోన్లు దోపిడీకి గురయ్యాయని ఫిర్యాదులున్నాయి. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచిన మామ్నూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తన సిబ్బందితో రామ్ గోపాలపురం వద్ద నిందితురాలను అరెస్ట్ చేశారు. విజయ్ కుమార్ పరారీ లో ఉన్నాడు.

మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పిడి యాక్ట్..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేస్తున్న మహుబూబాద్ జిల్లాకు చెందిన అమ్మ పాలెం గ్రామానికి చెందిన దావూరి బిక్షంపై పోలీసులు పీడి యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల పేరుతో యువతి యువకులను మోసం చేస్తూ లక్షల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

First published:

Tags: Crime news, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు