హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఏజెన్సీలో కొనసాగుతున్న వేట.. నాలుగు రోజుల్లో 11 మంది అరెస్ట్..

Mulugu: ఏజెన్సీలో కొనసాగుతున్న వేట.. నాలుగు రోజుల్లో 11 మంది అరెస్ట్..

X
ములుగులో

ములుగులో 11 మంది మావోయిస్టుల అరెస్ట్

ములుగు జిల్లా (Mulugu District) ఏజెన్సీలో ఏం జరుగుతుంది. నాలుగు రోజుల వ్యవధిలోనే 11 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒకవైపు మావోయిస్టు కరపత్రాలు విడుదల చేస్తున్న తరుణంలోనేవెంకటాపురం పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టుచేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

ములుగు జిల్లా (Mulugu District) ఏజెన్సీలో ఏం జరుగుతుంది. నాలుగు రోజుల వ్యవధిలోనే 11 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒకవైపు మావోయిస్టు కరపత్రాలు విడుదల చేస్తున్న తరుణంలోనేవెంకటాపురం పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టుచేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పూర్తి దట్టమైన అటవీ ప్రాంతం.. చతిస్ ఘడ్ రాష్ట్ర అటవీ ప్రాంతానికి సరిహద్దు గల ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో కరపత్రాలు కలకలం సృష్టించాయి. వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుంది. ఈ ప్రాంతాలను, గోదావరి నది పరివాహక ప్రాంతాలను ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలోనే వెంకటాపురం పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తున్న సమయంలో మావోయిస్టు మిలిషియాసభ్యులను అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోని 11 మందిని అరెస్టు చేసి పోలీసులు తమదైన ముద్రను వేసుకుంటున్నారు. వెంకటాపురం మండలం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది చదవండి: గ్రామీణ అభివృద్ధి సంస్థలో రూ.3 కోట్ల కుంభకోణం.. నిజా నిజాలేంటి?

ఏటూరు నగరం ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపురం కాణిపాక గ్రామానికి చెందిన కురుసం రాంబాబు, బడిసి బాలరాజు, కుంజ శంకర్, కుస్రం మల్లయ్య, గట్టుపల్లి రాంబాబు, కొరం సత్యంలను పోలీసులు అరెస్ట్ చేశారు.. వీరి నుంచి పిఎల్ జిఏ వారోత్సవాల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి అధిక వడ్డీ వసూలు చేశారో జాగ్రత్త.. కలకలం రేపుతున్న పోస్టర్లు

వీరు 2018 నుంచి మావోయిస్టు పార్టీలకు సహాయ సహకారాలు అందిస్తూ సానుభూతిపరుల నుంచి మీలిషియ సభ్యులుగా పదోన్నతి పొందారు. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకు పార్టీ పనులను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టు అగ్ర నేతలను సైతం కలిసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో వాటికి సంబంధించిన పోస్టర్లను జనావాసాలలో వేసేందుకు వస్తున్న క్రమంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంకటాపురం పోలీసులు వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కరపత్రాలతో పాటు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలలో కూడా పాల్గొన్నట్లు ఆరుగురు సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ వాతావరణం రోజుకి వేడెక్కుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఘట్టమైన అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరిని పట్టుకోవడంలో వెంకటాపురం పోలీసులు కీలకపాత్ర పోషించారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు