హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం.. పోలీసులు అలర్ట్

Mulugu: జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం.. పోలీసులు అలర్ట్

ఏజెన్సీలో అప్రమత్తమైన అధికారులు

ఏజెన్సీలో అప్రమత్తమైన అధికారులు

Mulugu: వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు మావోయిస్టుల చర్యలను తిప్పి కొడుతున్నారు. ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడ్వాయి పోలీసులు పేలుడు పదార్థాలతో చర్ల వైపు వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు మావోయిస్టుల చర్యలను తిప్పి కొడుతున్నారు. ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడ్వాయి పోలీసులు పేలుడు పదార్థాలతో చర్ల వైపు వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలు దొరకడంతో మావోయిస్టులు ఎలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారో ఎవరికి అంతు పట్టడం లేదు.

మూడు రోజుల క్రితం అయిదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. అనంతరం మరోఆరుగురు వ్యక్తులను కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మావోయిస్టు పార్టీ ఫండ్ కోసం మావోయిస్టుల పేరుతో నకిలీ లేఖలు విడుదల చేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు తాడ్వాయి పోలీసులు పేలుడు పదార్థాలతో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే ఏజెన్సీలో మావోయిస్టు ఎలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారో అని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పేలుడు పదార్థాలతో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వివరాలను ములుగు ఏఎస్పిసుధీర్ రామ్ నాధ్ కేకన్ వెల్లడించారు.

ఈనెల 04వ తేదీన మావోయిస్టు PLGA వారోత్సవాల సందర్భంగా సాయంత్రం 04 గంటల సమయంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాడ్వాయి SI మరియుస్టేషన్ సిబ్బంది కలిసి తడ్వాయి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారు తడ్వాయి బస్టాండ్ ఏరియా కి రాగా అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి పోలీసు వారిని చూసి భయపడి పారిపోవుటకు ప్రయత్నించగా వారు వెంబడించి పట్టుకొని తనిఖీ చేసారు. అతని దగ్గర పేలుడు పదార్థాలు విప్లవ సాహిత్యం దొరికాయి.

అతని పేరు తెలుసుకోగా కుంట గట్టయ్య s/o రాజమళ్ళు, వయసు : 57 సంవత్సరాలు, కులం ఎస్సీ మాదిగ, వృత్తి : కూలి r/o పెద్దరాతపల్లి (గ్రామం), కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా అని తెలిసింది. అతను పీపుల్స్ వార్ పార్టీ పెద్దపల్లీ ఏరియా దళ కమాండర్ గా ఉన్నటువంటి నిదానపు కొమరయ్య@ బాలయ్య దళంకు మిలిటెంట్ గా పనిచేసేవాడు.. దళంలో కూడా తిరిగేవాడు. అట్టి సమయంలో దళ సభ్యుడైన కంకణాల రాజిరెడ్డి @ వెంకటేష్ అతనికి పరిచయం అయ్యాడు.

నిషేధిత మావోయిస్టు పార్టీకి సంబంధించిన పోస్టర్స్ పడిన కారణంగా కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా సుమారు 10 రోజులు జైలులో కూడా ఉన్నాడు. గత 6 నెలల క్రితం తనకు ఉన్నటువంటి 2 ఎకరాల వ్యవసాయ భూమిలో తన అన్న శంకరయ్య ఒక ఎకరం బలవంతంగా లాక్కోవడం జరిగింది. అట్టి 1 ఎకరం భూమిని తనకు ఇవ్వమని ఎన్ని సార్లు పంచాయితీ చేసినా, పెద్ద మనుషులు చెప్పిన వినకుండా తన భూమి తనకు ఇవ్వడం లేదని, అదేవిధంగా మిగిలిన ఒక ఎకరం కూడా తన పేరు మీద పట్టా కావడం లేదు.

ఎన్నిసార్లు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన కూడా పని కాలేదని, ఇట్టి భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో కంకణాల రాజిరెడ్డి @ వెంకటేష్ కి ఫోన్ చేసి తన భూమి సమస్య గురించి చెప్పి సమస్య పరిష్కారం కావడం లేదని, ఇక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పడంతో వెంకటేష్ తనను మావోయిస్టు పార్టీకి పూర్తిగా పనిచేయమని, దళంలోకి రమ్మని, చెప్పగా తను దళంలోకి వస్తానని చెప్పాడు.

కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన విధంగా కాల్వ శ్రీరాంపూర్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గరికి వచ్చి మందు గుండు సామాగ్రి ఇవ్వగా తన అన్న మీద కక్షతో దళంలోకి చేరాలని నిర్ణయించుకొని రాజిరెడ్డి ఆదేశాల మేరకు తన దగ్గర ఉన్న విప్లవ సాహిత్యం, మందుగుండు సామాగ్రితో సోమవారం ఉదయం వారి ఊరు నుండి బయల్దేరి తాడ్వాయికి బస్సులో వచ్చి తడ్వాయి బస్టాండ్ వద్ద దిగి మళ్ళీ చర్ల వైపు వెళ్లే బస్సు ఎక్కాలని బస్సు కోసం ఎదురు చూస్తూ అనుమానాస్పదంగా ఉన్నాడు.

ఈలోగా కుంట గట్టయ్యను తాడ్వాయి పోలీసులు అదుపులోకి తీసుకొని మందు గుండు సామాగ్రి, విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ములుగు ఏసీపీ సుధీర్ రామ్ నాధ్ కేకన్ IPS దర్యాప్తు అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు1) జిలీటన్ స్టిక్స్ - 052) డెటోనేటర్స్- 033) విప్లవ సాహిత్యం.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు