హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఎడ్ల బండ్ల ర్యాలీతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

Mulugu: ఎడ్ల బండ్ల ర్యాలీతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

X
సీతక్క

సీతక్క ఎడ్ల బండి ర్యాలీ

Mululgu: ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఎప్పుడు ప్రజల పక్షాన ముందుండి నిలబడి పోరాడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వైఫల్యాలను సైతం ఎండగడుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఎప్పుడు ప్రజల పక్షాన ముందుండి నిలబడి పోరాడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వైఫల్యాలను సైతం ఎండగడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ పై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణలోని రైతుల వివరాలను ప్రైవేటు వ్యక్తులు నమోదు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ధరణి పోర్టల్ రద్దు చేయాలనిపోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డి ఎల్ ఆర్ గార్డెన్ నుండి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.

ములుగు ఆర్డీవో కు వినతి పత్రం

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని, ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు.. సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు. వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి. కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది. భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి. పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్కఅన్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు