హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Seethakka: సజ్జనార్ తో సీతక్క భేటీ.. ఆమె కోరింది ఇదే..!

MLA Seethakka: సజ్జనార్ తో సీతక్క భేటీ.. ఆమె కోరింది ఇదే..!

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో సీతక్క భేటీ

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో సీతక్క భేటీ

ములుగు (Mulugu District) ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంతగా కనిపించడం లేదు. ములుగు ప్రాంతం అభివృద్ధి కోసం ములుగు శాసనసభ సభ్యురాలు సీతక్క అనునిత్యం పాటుపడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu, News18, Mulugu

ములుగు (Mulugu District) ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంతగా కనిపించడం లేదు. ములుగు ప్రాంతం అభివృద్ధి కోసం ములుగు శాసనసభ సభ్యురాలు సీతక్క అనునిత్యం పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన అధికారులను నిత్యం కలుస్తూ.. సమస్యలను వివరిస్తూ.. సమస్యలకు పరిష్కార మార్గం వెతుకుతుంటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగు జిల్లా ఏర్పాటు జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. బస్సు డిపో ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ములుగు జిల్లాకు బస్ డిపో మంజూరు చేసినప్పటికీ ఇప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే హనుమకొండ కేంద్రం నుంచి ములుగు ప్రాంతం వైపు రావాలంటే రాత్రి సమయం ఏడు గంటలు దాటితే బస్సులు దొరకని పరిస్థితి నెలకొంది. ములుగు వైపు ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనిలో భాగంగానే ఏటూరునాగారంలో బస్ డిపోను ఏర్పాటు చేయాలని.. ములుగు బస్ స్టేషన్ ఆధునీకరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆర్టిసి ఎండి సజ్జనార్ ను కలిశారు. ములుగు జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం కాగా.. ఈ ప్రాంతం విస్తరణలో పెద్దది అభివృద్ధి లో మాత్రం చిన్నది. ఇక్కడ అనేక పర్యాటక కేంద్రాలు బొగత, లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం, దేశంలోనే అతి పెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం, ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇలా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీఅభివృద్ధిలో మాత్రం వెనుకబాటుకు గురవుతుంది. కనీసంమారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం లేక ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు, రాత్రి 7 గంటలు దాటితే కనీసం బస్ కూడా నడువదు.

ఇది చదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదే.. పెద కుటుంబానికి అండగా మహిళ

ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి అనేక ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్నారు. ఇంకా ములుగు ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామాలలో బస్ పోని గ్రామాలు, బస్ చూడని ప్రజలు ఉన్నారంటే నమ్మక తప్పదు. ములుగు జిల్లా ఏర్పాటు జరిగి 4 యేండ్లు పూర్తి కావస్తున్నా.. నూతన బస్ స్టాండ్ లేదు. ఇప్పడు ఉన్న బస్ స్టాండ్ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు చెయ్యడం వల్ల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఛత్తీస్ ఘడ్ (Chattisgarh), ఓరిస్సా ఇలా అనేక రాష్ట్రాలకు ప్రయాణం సులువు అవుతుంది. కావున ములుగు జిల్లా కేంద్రములో అత్యంత అధునాతనమైన బస్ స్టాండ్, ప్రయాణికులకు వీలుగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేకుండా పోయిందని.. ఇప్పటికైనా ఆర్టిసి అధికారులు చొరవ చూపించిబస్సు డిపో మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆర్టిసి ఎండి సజ్జనార్ ను కోరారు.

First published:

Tags: Local News, MLA seethakka, Mulugu, Telangana

ఉత్తమ కథలు