హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: పర్యాటకులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన

Mulugu: పర్యాటకులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన

X
ములుగు

ములుగు జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి

ఏటూర్ నాగారం అభయ అరణ్యంలోని పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ములుగు జిల్లా (Mulugu District) అటవీ అధికారి కృష్ణ గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

ఏటూర్ నాగారం అభయ అరణ్యంలోని పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ములుగు జిల్లా (Mulugu District) అటవీ అధికారి కృష్ణ గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అనేకమైన ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాలో ఉన్నాయి. సెలవు రోజుల వచ్చాయంటే చాలు అనేకమంది పర్యాటకులు ములుగు జిల్లాకు విచ్చేస్తూ ఉంటారు. ఉరుకుల పరుగుల నగర జీవితంలో అలసిపోయిన వారు సెలవు రోజుల్లో అయినా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటారు. అలాంటి వారికి ములుగు జిల్లా ఘన స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలోని ఉంటాయి కాబట్టి.

ములుగు జిల్లాలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉంటుంది. అనేక పర్యాటక ప్రాంతాలు దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిపై అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏకోటూరిజం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఉదాహరణకు దట్టమైన అటవీ ప్రాంతంలో సైక్లింగ్, ఫారెస్ట్ ట్రేకింగ్, నైట్ క్యాంపులు, క్యాంప్ ఆఫ్ ఫైర్స్ వంటి కార్యక్రమాలు పర్యాటకులకు అందుబాటులో ఉండేవి. అంతేకాకుండా వింటర్ సీజన్లో ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరి అధికారుల వైఫల్యం ఏమో తెలియదు కానీ ఎకో టూరిజం మూతపడిపోయింది.. మరుగున పడిపోయింది.

ఇది చదవండి: పర్ణశాలపై ఇంత నిర్లక్ష్యమా..? పవిత్ర ప్రదేశాన్ని పట్టించుకోరా..?

గత కొద్ది రోజుల క్రితం ములుగు జిల్లా అటవీ అధికారిగా కృష్ణ గౌడ్ IFS పదవి బాధ్యతలు స్వీకరించారు. అయన వచ్చిన అనంతరం ములుగు జిల్లా మొత్తం పర్యటించారు. ఎక్కడ ఎలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది అనే అంశాలపై దృష్టి సారించారు. అనుకున్నదే తడువుగా మూలకు పడ్డ ఎకో టూరిజాన్ని పరుగులు పెట్టించాలనుకున్నాడు. వెంటనే అభివృద్ధి పనులను సైతం ప్రారంభించారు.

ఇది చదవండి: వింటర్ లో థ్రిల్ ఇచ్చే టూర్ ఇదే..! లక్నవరంలో బోట్ షికారు చేస్తారా..?

అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్ మొదటి వారంలో ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఏకో టూరిజం కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని అధికారి చెప్తున్నాడు. ఎకో టూరిజం వల్ల స్థానికంగా ఉండే యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుందని అటవీ శాఖకు కూడా ఆదాయం వస్తుందని రాబోయే రోజుల్లో అటవీ ప్రాంతంలో ఉండే పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తానని కృష్ణ గౌడ్ న్యూస్ 18తో చెప్పారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు