హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: 18 ఏళ్లు నిండాయా..? ఈ వార్త మీకోసమే

Mulugu: 18 ఏళ్లు నిండాయా..? ఈ వార్త మీకోసమే

Vote

Vote

జాబితా నుంచి ఓటర్ తొలగింపు ప్రక్రియ కట్టుదిట్టంగా అమలు చేయాలని, పట్టణ ప్రాంతాలలో మరింత వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu Medipelly, News18, mulugu

ములుగు జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 8 వరకు కొత్త ఓటరుగా నమోదు, చేర్పులకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య చెప్పారు. 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం. ఫారం-6 నింపి క్రొత్త ఓటరుగా నమోదు, 6బితో ఆధార్ లింక్ చేసుకోవాలి. ఫారం -8 నింపి ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలి.

Read Also : Rajanna Siricilla: టేకు చెక్కతో సీఎం కేసీఆర్ ప్రతిమ చెక్కిన వడ్రంగి కళాకారుడు

www.nvsp.in, ceo.telangana.nic.inవెబ్సైట్ ద్వారా, Voter Help Line App ద్వారా ఆన్లైన్ లో నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక పై 3 నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 8 వరకునూతన ఓటరు నమోదు, డ్రాఫ్ట్ జాబితా లో మార్పులకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్ కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో తెలుపవచ్చని అన్నారు. వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను డిసెంబర్ 26 లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. 18సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటరుగా నమోదుకు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మంది ఓటరుగానమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇందులో భాగంగాజిల్లాలో ప్రతి డిగ్రీ కళాశాల స్థాయిలో ప్రత్యేక అధికారులను కేటాయించి 18సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సెక్స్ వర్కర్ల జాబితా, ట్రాన్స్ జెండర్ జాబితా, దివ్యాంగుల జాబితా ప్రత్యేకంగా తయారు చేయాలని అన్నారు. హెచ్.ఐ.వినియంత్రణకు పని చేస్తున్న స్వచ్చంద సంస్థలు, జిల్లా వైద్య శాఖ వద్ద ఉన్న సెక్స్ వర్కర్ల జాబితా అందజేయాలని, ట్రాన్స్ జెండర్ ల జాబితాను జిల్లా సంక్షేమ అధికారి అందజేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో అందిస్తున్న దివ్యాంగుల ఆసరా పెన్షన్ , సదరం సర్టిఫికెట్ ల దరఖాస్తుల నుంచి దివ్యాంగులను గుర్తించి వివరాలను ఓటరు జాబితాలో మ్యాప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఓటరు జాబితా ఇకపై ప్రతి సంవత్సరం 4 సార్లు 3 నెలలకు ఒకసారి అప్ డేట్అవుతుందని.. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1 తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని అన్నారు.గ్రామస్థాయిలోపట్టణ ప్రాంతంలోఅధికారులను భాగస్వామ్యం చేస్తూ ఓటరు నమోదు పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, ఓటరు నమోదు కోసం ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలపై టాం టాం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నదని, 17 ఏళ్ల వయసు పై బడిన పౌరులు ఓటర్ కార్డు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. యువకులు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేకుండా,ఇప్పటివరకు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా తాజా నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం కల్పించినట్లుతెలిపారు.

సెక్స్ వర్కర్ల, ట్రాన్స్ జెండర్ ల ఓటరు నమోదుపై ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న బూత్ స్థాయి అధికారులకు ఓటర్ నమోదుకు సంబంధించి సంపూర్ణ అవగాహన ఉండే విధంగా శిక్షణ అందించాలని తెలిపారు. జాబితా నుంచి ఓటర్ తొలగింపు ప్రక్రియ కట్టుదిట్టంగా అమలు చేయాలని, పట్టణ ప్రాంతాలలో మరింత వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు