Home /News /telangana /

MULUGU MULUGU DISTRICT RESIDENT FIGHTING AGAINST THE GOVERNMENT FOR TAKING LAND COMPENSATION AND NOT GIVING A JO SNR MMV BRV

Mulugu: భూమి తీసుకొని పరిహారం ఎగ్గొట్టారు .. సర్కారుపై సామాన్యుడి పోరాటం

(ఒంటరి

(ఒంటరి పోరాటం)

Mulugu: ఉన్న ఐదెకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోగా..పరిహారం దక్కకపోగా కనీసం ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇప్పించాలంటూ వేడుకుంటున్నాడు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు రామన్న అనే యువకుడు.

    (Venu Medipelly,News18,mulugu)
    ప్రభుత్వం స్పందించదు, అధికారులు పట్టించుకోరు..తనకు ఇక న్యాయం జరిగేదెప్పుడని అంటున్నాడు ఆ యువకుడు. ఉన్న ఐదెకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోగా..పరిహారం దక్కకపోగా కనీసం ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇప్పించాలంటూ వేడుకుంటున్నాడు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు రామన్న అనే యువకుడు.
    ములుగు(Mulugu)జిల్లా గోవిందరావుపేట( Govindaraopeta)మండలం చల్వాయి(Chalwai)గ్రామానికి చెందిన సురపాక రామన్న(Surapaka Ramanna)MA B.Ed చదువుకున్నాడు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో పెద్దదిక్కు లేక కుటుంబం చితికుల పడింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆ కుటుంబాన్ని తల్లి పోషించుకుంటూ వచ్చింది. చిన్నతనంలో తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ చదువు పూర్తి చేశాడు రామన్న. తమ తాతల కాలం నుంచి వచ్చిన ఐదెకరాల పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు రామన్న. M.A Bed చేయడంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తన తల్లిని సంతోషంగా చూసుకోవాలనుకున్నాడు. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా ఉన్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించాలనుకున్నాడు.

    భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం:
    ఉద్యోగం లేని పక్షంలో వ్యవసాయమే కొనసాగిద్దామని రామన్న అనుకుంటుండగా ఇంతలో ప్రభుత్వ నిర్ణయం యువకుడి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మోడల్ స్కూల్స్ కోసం భూమిని సర్వే చేస్తున్న క్రమంలో రామన్నకు చెందిన ఐదు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అంటూ ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా అక్కడ మోడల్ స్కూల్ నిర్మించింది ప్రభుత్వం. భూమి తీసుకున్నందుకుగానూ నష్టపరిహారం ఎలాగో లేదు కనీసం అర్హత ఉంది కాబట్టి పాఠశాలలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ను, స్థానిక అధికారులను వేడుకున్నాడు రామన్న. అయినా అధికారులతో పాటు ప్రభుత్వం తన గోడును పట్టించుకోలేదని..ఐదు ఎకరాలు తీసుకున్నందుకు గాను కనీస పరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వలేదని రామన్న ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇది చదవండి: పొలాన్ని చెరువుగా మార్చి చేపల పెంపకం.. నాగర్‌కర్నూల్‌లో మొదటిసారిగా ఆక్వా సాగు.. వివరాలివే



    ఆ భూమి ప్రభుత్వానిదే అంటున్న అధికారులు:
    ప్రభుత్వ భూమి అంటూ ఐదు ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడ పాఠశాల నిర్మించారు. కానీ రామన్న చెప్పేదేమిటంటే ఆ భూమి తమ తాతల నుంచి మాకు సంక్రమించిందని, తన తాత అప్పటి రజాకార్లకు కట్టిన శిస్తు పత్రాలు కూడా ఉన్నాయంటున్నాడు. కానీ ఆ భూమిని ప్రభుత్వం ఎందుకు పట్టా చేయలేదో తనకు తెలియదని వాపోయాడు రామన్న. భూమి హక్కు గురించి కొందరు అధికారులను ప్రశ్నించగా అన్ని పత్రాలు కరెక్టుగా ఉంటే మీ తాత అప్పుడే పట్టా చేయించుకోవాల్సిందని, ఇప్పుడు మాత్రం ఆ భూమి ప్రభుత్వ భూమిగానే రికార్డులో చేరింది కాబట్టి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వంతో పోరాటం చేసే సామర్థ్యం లేక, కడుపునిండా తినలేక, కంటి నిండా నిద్రలేక.. ఒకవైపు జరిగిన అన్యాయం..మరోవైపు పేదరికంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు రామన్న ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇది చదవండి: అక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు ఉన్నా బీఎస్పీ నేతలు అరెస్ట్ కావాల్సిందేనా?


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Mulugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు